×

Saturday, Feb-04th-2023


Sunday, Jan-29th-2023 to Saturday, Feb-04th-2023


Aries


అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. ఆచితూచి అడుగు వేయాలి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఖర్చులు రూపొందించుకుంటారు. డబ్బుకు ఇబ్బంది వుండదు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. సోమ, మంగళ వారాల్లో బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. పట్టుదలతో శ్రమించినా గానీ పనులు పూర్తికావు. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. గృహంలో మార్పులు చేర్పులు కలిసివస్తాయి. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి. ప్రైవేట్ సంస్థ ఉద్యోగస్తులకు ఓర్పు, ఏకాగ్రత ప్రధానం. రవాణా, సేవా రంగాల వారికి ఆదాయాభివృద్ధి.


మేషం


అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. సకాలంలో వాయిదాలు చెల్లిస్తారు. మనస్సు కుదుటపడుతుంది. పనుల్లో ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. కొత్త విషయాలు బాధ్యతలు స్వీకరిస్తారు. శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. శుభకార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. అవివాహితులకు శుభయోగం. నిర్మాణాలు, మరమ్మతులు చేపడతారు. కార్మికులకు సదవకాశాలు లభిస్తాయి. ఉపాధ్యాయులకు పదోన్నతి, విద్యార్థులకు ఒత్తిడి , ఆందోళన అధికం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. కంప్యూటర్ , సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి.


మేషం


అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం కార్యసాధనకు తీవ్రంగా శ్రమిస్తారు. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. ప్రణాళికలు వేసుకుంటారు. పనుల్లో అవాంతరాలు తొలగిపోతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. ఆది, గురువారాల్లో ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. అపరిచితులతో జాగ్రత్త. కుటుంబ విషయాలు గోప్యంగా వుంచండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పును గమనిస్తారు. ఆత్మీయుల రాక ఉల్లాసాన్నిస్తుంది. సంతానం దూకుడు అదుపుచేయండి. పత్రాల రెన్యువల్ అలక్ష్యం తగదు. ఆరోగ్యం సంతృప్తికరం. వ్యాపారాల్లో ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు. షాపుల స్థలమార్పు కలిసివస్తుంది. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. విద్యాసంస్థలకు ఆశాజనకం. పుణ్యకార్యంలో పాల్గొంటారు.


Tarus


కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు సంప్రదింపులతో తీరిక వుండదు. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కష్టం వృధా కాదు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. ఖర్చులు అధికం. డబ్బుకు ఇబ్బంది వుండదు. ఆప్తులకు సాయం అందిస్తారు. పనులు సానుకూలమవుతాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. పత్రాలు, నగదు జాగ్రత్త. గృహమరమ్మతులు చేపడతారు. సందేశాలు, ప్రకటనలను విశ్వసించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఆరోగ్యం స్థిరంగా వుంటుంది. ఉపాధ్యాయులకు శుభయోగం. ప్రశంసలు, పురస్కారాలు అందుకుంటారు. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. దైవకార్య సమావేశంలో పాల్గొంటారు.


వృషభం


కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అయిన వారితో సత్సంబంధాలు నెలకొంటాయి. ఖర్చులు అధికం. డబ్బుకు ఇబ్బంది వుండదు. ఆది, సోమవారాల్లో పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. నగదు, పత్రాలు జాగ్రత్త. గృహమార్పు కలిసివస్తుంది. మీ జోక్యం అనివార్యం. మీ సలహా సన్నిహితులకు ఉపకరిస్తుంది. సంతానం పై చదువులపై దృష్టిపెడతారు. ప్రకటనలు, సందేశాలను విశ్వసించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఆరోగ్యం సంతృప్తికరం. ధార్మిక విషయాల పట్ల ఆసక్తి కలుగుతుంది. వ్యాపారాలు సామాన్యం. షాపు పనివారలతో జాగ్రత్త. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. బెట్టింగులకు పాల్పడవద్దు.


వృషభం


కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు వాగ్ధాటితో రాణిస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. పదవుల కోసం సాగిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త. ఖర్చులు అదుపులో వుండవు. ధనసమస్యలెదురవుతాయి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. సోమ, మంగళవారాల్లో అప్రియమైన వార్తలు వినవలసి వస్తుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఉపాధి పథకాలు కలిసివస్తాయి. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. ఉద్యోగస్తులకు శుభయోగం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. పెట్టుబడులకు తరుణం కాదు. కంప్యూటర్ రంగాల వారి ఆదాయం బాగుంటుంది. పిల్లలకు వాహనం ఇవ్వవద్దు.


Gemini


మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు ఈ వారం ఆశాజనకం. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. మీ నమ్మకం వమ్ముకాదు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. ఆదాయానికి తగినట్లు ఖర్చులుంటాయి. పెట్టుబడులకు తరుణం కాదు. ఒకేసారి అనేక పనులతో సతమతమవుతారు. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. అయిన వారు మీ అశక్తతను అర్థం చేసుకుంటారు. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. పత్రాల రెన్యువల్‌లో మెలకువ వహించండి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు హోదామార్పు, స్థానచలనం. వృత్తి ఉపాధి పథకాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. ఉమ్మడి వ్యాపారాలు కలిసివస్తాయి. చిరు వ్యాపారులకు ఆశాజనకం.


మిధునం


 మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు వ్యవహారానుకూలత వుంది. పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం. మనోధైర్యంతో ముందుకు సాగండి. ఆదాయం సంతృప్తికరం. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెద్దమొత్తం ధనసాయం తగదు. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా వ్యక్తం చేయండి. ఎవరినీ కించపరచవద్దు. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. మంగళవారం నాడు అనుకోని సంఘటనలెదురవుతాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. ఆహ్వానం అందుకుంటారు. ఉపాధ్యాయులకు పదోన్నతి. న్యాయ వైద్య సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. కార్మికులకు సదవకాశాలు లభిస్తాయి. వ్యాపారలు అంతంత మాత్రంగా సాగుతాయి. భాగస్వామిక వ్యాపారాలకు తరుణం కాదు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.


మిధునం


మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు ప్రతి విషయంలో ధైర్యంగా వుంటారు. ఆర్థికంగా బాగుంటుంది. కొన్ని సమస్యలు సద్దుమణుగుతాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. కొత్త పనులు ప్రారంభిస్తారు. వ్యాపకాలు విస్తరిస్తాయి. ఆత్మీయులకు ముఖ్య సమాచారం అందిస్తారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. బుధవారం నాడు పత్రాలు, ఆభరణాలు జాగ్రత్త. ఒక ఆహ్వానం ఆలోచింపజేస్తుంది. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. వైద్య సేవలు అవసరం. గృహమార్పు ఫలితం నిదానంగా కనిపిస్తుంది. నిర్మాణాలు ఊపందుకుంటాయి. కార్మికులకు ఆశాజనకం. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. వృత్తుల వారికి సామాన్యం. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు.


Cancer


పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష ఆదాయం బాగుంటుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. రుణ సమస్యలు కొలిక్కివస్తాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. పనులు వేగవంతమవుతాయి. మంగళ, గురువారాల్లో విలువైన వస్తువులు జాగ్రత్త. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను మధ్యవర్తుల ద్వారా తెలియజేయండి. దంపతుల మధ్య దాపరికం తగదు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. సొంత పరిజ్ఞానంతో మందులు వేసుకోవద్దు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ఉపాధ్యాయులకు పదవీయోగం. ఏజెంట్లు, రిప్రజెంటేటివ్‌లు టార్గెట్లను అధిగమిస్తారు. అధికారులకు బాధ్యతల మార్పు. ఉపాధి పథకాలు చేపడతారు.


కర్కాటకం


 పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష మీ మాటే నెగ్గాలన్న పంతం తగదు. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. లౌక్యంగా వ్యవహరించడం మంచిది. అనుభవజ్ఞుల సలహా పాటించండి. బంధుమిత్రులతో స్పర్ధలు తలెత్తుతాయి. మీ మాటతీరు అదుపులో వుంచుకోండి. బుధ, గురువారాల్లో పనులు హడావుడిగా సాగుతాయి. ఒక ఆహ్వానం ఉత్సాహానిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఖర్చులు విపరీతం. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. ఆప్తుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్య సేవలు అవసరం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వృత్తి, ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. ముఖ్యులలో ఒకరికి వీడ్కోలు పలుకుతారు.


కర్కాటకం


పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష పరిస్థితులు మెరుగుపడతాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. డబ్బుకు లోటుండదు. విలాసాలకు వ్యయం చేస్తారు. మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. పనులు సానుకూలమవుతాయి. పత్రాలు అందుకుంటారు. గురు శుక్రవారాల్లో నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్త. బ్యాంకు వివరాలు గోప్యంగా వుంచండి. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఏజెన్సీలు, మధ్యవర్తులను విశ్వసించవద్దు. అవివాహితుల ఆలోచనలు పలు విధాలుగా వుంటాయి. నిర్మాణాలు, మరమ్మతులు చేపడతారు. ఉద్యోగస్తులకు శుభయోగం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. వేడుకల్లో అత్యుత్సాహం తగదు.


Leo


 మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం పరిస్థితులు అనుకూలిస్తాయి. అనుకున్నది సాధిస్తారు. పదవులు, సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. వ్యతిరేకులు సైతం చేరువవుతారు. ఆదాయ వ్యయాలకు పొంతన వుండదు. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి వుంటుంది. అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. ఉల్లాసంగా గడుపుతారు. శుక్ర, శని వారాల్లో అప్రమత్తంగా వుండాలి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. కొన్ని విషయాలు చూసీ చూడనట్లు వదిలేయండి. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. నిర్మాణాలు ఊపందుకుంటాయి. కార్మికులకు సదవకాశాలు లభిస్తాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. పెద్దమొత్తం సరుకు నిల్వల్లో జాగ్రత్త. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక వుండదు. ఉపాధ్యాయులకు పురస్కారయోగం.


సింహం


మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం కార్యసిద్ధికి ఓర్పు ప్రధానం. యత్నాలు విరమించుకోవద్దు. మీ సమర్థతపై నమ్మకం పెంచుకోండి. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఖర్చులు అదుపులో వుండవు. అవసరాలకు ధనం అందుతుంది. కీలక పత్రాలు అందుకుంటారు. మంగళ, శనివారాల్లో పనులు సాగవు. ఆలోచనలు పలు విధాలుగా వుంటాయి. గృహమార్పు నిదానంగా ఫలిస్తుంది. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు కష్టకాలం. వృత్తి ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపారాల్లో ఆటుపోట్లు అధికం. ప్రస్తుత వ్యాపారాలే కొనసాగించండి. ఉద్యోగస్తులకు ఒత్తిడి పనిభారం. అధికారులకు హోదామార్పు, ప్రైవేట్ సంస్థ ఉద్యోగస్తులకు కష్టకాలం. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త.


సింహం


మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం కష్టించినా ఫలితం వుండదు. నిస్తేజానికి లోనవుతారు. అవకాశాలు చేజారిపోతాయి. ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుతారు. రుణ సమస్యలు వేధిస్తాయి. శనివారం నాడు ఏ పనీ సాగదు. ప్రశాంతంగా వుండేందుకు ప్రయత్నించండి. ఆత్ముయుల కలయికతో కుదుటపడతారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. అయిన వారు మీ అశక్తతను అర్థం చేసుకుంటారు. సంతానం చదువులపై శ్రద్ధ వహించండి. ఆరోగ్యం జాగ్రత్త. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. ఉపాధి పథకాలు ఏమంత సంతృప్తినీయజాలవు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. హోల్‌సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు కష్టకాలం. ప్రయాణంలో ఒకింత అవస్థలు తప్పవు.


Virgo


 ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు ఆర్థిక స్థితి నిరాశాజనకం. దుబారా ఖర్చులు విపరీతం. ఏ పురోగతి లేక నిరుత్సాహం చెందుతారు. స్థిమితంగా వుండేందుకు ప్రయత్నించండి. వ్యాపకాలు సృష్టించుకోవటం మంచిది. ఆత్మీయుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. మానసికంగా కుదుటపడతారు. ఆది, సోమవారాల్లో పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. దురుసుతనం తగదు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తుల సమర్థతకు ఏమంత గుర్తింపు వుండదు. అధికారులకు బాధ్యతల మార్పు, ఉపాధి పథకాలు నిరుత్సాహపరుస్తాయి.


కన్య


ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు ప్రతికూలతలు అధికం. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. అప్రమత్తంగా వుండాలి. శకునాలు పట్టించుకోవద్దు. మనోధైర్యంతో వ్యవహరించండి. అవకాసాలు చేజారిపోయినా ఒకందుకు మంచిదే. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. సోమ, మంగళవారాల్లో ముఖ్యుల కలయిక వీలుపడదు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. గృహమరమ్మతులు చేపడతారు. ఖర్చులు అధికం. ఒక అవసరానికి వుంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి, శ్రమ అధికం. ప్రయాణం విరమించుకుంటారు.


కన్య


 ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు శుభకార్యాన్ని నిరాడంబరంగా చేస్తారు. ఆప్తులు రాకపోవడంతో నిరుత్సాహం చెందుతారు. గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. ఖర్చులు విపరీతం. పొదుపు ధనం ముందుగా గ్రహిస్తారు. ఆది, సోమవారాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. ముఖ్యుల కలయిక కోసం పడిగాపులు తప్పవు. సంతానం విషయంలో మంచే జరుగుతుంది. సంస్థల స్థాపనలకు అనుకూలం. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. పదవులు చేజారిపోతాయి. యత్నాలు విరమించుకోవద్దు. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఆరోగ్యం స్థిరంగా వుంటుంది. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉమ్మడి వ్యాపారాలు కలసివస్తాయి. వాహనచోదకులకు దూకుడు తగదు.


Libra


చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు వ్యవహారాల్లో తప్పటడుగు వేసే ఆస్కారం వుంది. గత తప్పిదాలు పునరావృతమయ్యే సూచనలున్నాయి. పెద్దల సలహా పాటించండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. ఆదాయం బాగున్నా సంతృప్తి వుండదు. మీ ఉన్నతిని చాటుకోవడానికి విరివిగా వ్యయం చేస్తారు. సంతానం మొండి వైఖరి ఇబ్బంది కలిగిస్తుంది. మంగళ, బుధవారాల్లో ముఖ్యుల కలయిక వీలుపడదు. పనులు వాయిదా వేసుకుంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. గృహమార్పు అనివార్యం. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. అనవసర జోక్యం తగదు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. హోల్ సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు కష్టకాలం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు స్వాగతం పలుకుతారు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం తగదు.


తుల


చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. బంధువులతో ఉల్లాసంగా గడుపుతాపు. గృహం సందడిగా ఉంటుంది. ఖర్చులు విపరీతం. పొదుపు ధనం ముందుగా గ్రహిస్తారు. చెల్లింపుల్లో జాగ్రత్త. కొత్త పనులు చేపడతారు. పత్రాల రెన్యువల్‌లో మెలకువ వహించండి. బుధావారం నాడు వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. అనవసర జోక్యం తగదు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. సంతానం ద్వారా శుభవార్తలు వింటారు. ప్రముఖులతో పరిచయలు బలపడతాయి. పదవులు, సభ్యత్వాలకు యత్నాలు సాగిస్తారు. ప్రత్యర్థుల వైఖరి ఆందోళన కలిగిస్తుంది. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. రిప్రజెంటేటివ్‌లకు ఒత్తిడి, పనిభారం. కార్మికులకు ఆశాజనకం. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు.


తుల


చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు అనురాగవాత్సల్యాలు పెంపొందుతాయి. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. పనులు త్వరితగతిన సాగుతాయి. మంగళ, బుధవారాల్లో పత్రాలు, ఆభరణాలు జాగ్రత్త. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. సంతానం కదలికలపై దృష్టి సారించండి. గృహమార్పు కలిసివస్తుంది. దంపతుల మధ్య దాపరికం తగదు. మీ సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. వివాహ యత్నం ఫలిస్తుంది. జాతక పొంతన ముఖ్యం. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ప్రైవేట్ సంస్థ ఉద్యోగస్తులకు కష్టకాలం. కీలక సమావేశాల్లో ప్రముఖంగా పాల్గొంటారు.


Scorpio


విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1, 2, 3, 4 పాదములు కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పరిచయాలు ఉన్నతికి దోహదపడతాయి. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధుత్వాలు బలపడతాయి. ఖర్చులు అదుపులో వుండవు. ఒక అవసరానికి వుంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. గురు, శుక్ర వారాల్లో తొందరపడి హామీలివ్వవద్దు. ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ప్రియతముల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ఉపాధ్యాయులకు పురస్కార యోగం. ప్రైవేట్, విద్యా సంస్థలకు కొత్త సమస్యలెదురవుతాయి. వ్యాపారాల్లో ఆటుపోట్లను అధిగమిస్తారు. మీ పథకాలు సత్ఫలితాలిస్తాయి. భవన నిర్మాణ కార్మికులకు పనులు లభిస్తాయి.


వృశ్చికం


విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1, 2, 3, 3 పాదములు సమర్థతను చాటుకుంటాు. నిజాయితీకి ప్రశంసలు లభిస్తాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఆప్తులకు సాయం అందిస్తారు. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. మీ సలహా ఉభయులకు ఆమోదయోగ్యం అవుతుంది. అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తి చేస్తారు. పెట్టుబడులకు అనుకూలం. కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు. ఇంటి విషయాలపై శ్రద్ద వహించండి. గురు, శుక్రవారాల్లో ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా వుండాలి. పరిచయం లేని వారితో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉపాధ్యాయులకు పదవీయోగం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. హోల్‌సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు కష్టకాలం.


వృశ్చికం


విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట ధైర్యంగా వ్యవహరిస్తారు. ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం ఫలిస్తుంది. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. పదవుల స్వీకరణకు అనుకూలం. వ్యతిరేకులను సైతం ఆకట్టుకుంటారు. గురువారం నాడు అప్రియమైన వార్తలు వినవలసి వస్తుంది. పనులు వాయిదా వేసుకుంటారు. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహించండి. గృహంలో మార్పు చేర్పులకు అనుకూలం. కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అతిగా శ్రమించవద్దు. పోగొట్టుకున్న వస్తువులు లభ్యం కావు. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి.


Sagittarius


మూల, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం అనుకూలతలు నెలకొంటాయి. వ్యవహార దక్షతతో నెట్టుకొస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. అవకాశాలు చేజిక్కించుకుంటారు. ఆదాయం బాగుంటుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. శనివారం నాడు పనులు హడావుడిగా సాగుతాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివస్తుంది. మీ ఇష్టాయిష్టాలను పెద్దల ద్వారా తెలియజేయండి. జాతక పొంతన ప్రధానం. కనిపించకుండా పోయిన పత్రాలు లభిస్తాయి. సంతానం దూకుడు అదుపు చేయండి. చెప్పుడు మాటలు పట్టించుకోవద్దు. పత్రాల రెన్యువల్‍‌లో మెలకువ వహించండి. ఉపాధ్యాయులకు శుభయోగం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. స్టాక్ మార్కెట్ లాభాల దిశగా సాగుతుంది. షేర్ల క్రయ విక్రయాలకు అనుకూలం.


ధనస్సు


మూల, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదం ఆదాయం సంతృప్తికరం. కొన్ని ఇబ్బందులు తొలగిపోతాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. రోజువారీ ఖర్చులే వుంటాయి. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. జాతక పొంతన అనివార్యం. తొందరపడి హామీలివ్వవద్దు. పెద్దల సలహా పాటించండి. ఆది, శనివారాల్లో దంపతుల మధ్య అకారణ కలహం. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. సంతానం వైఖరి విసుగు కలిగిస్తుంది. అనునయంగా కలిసివస్తుంది. వైద్యరంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు.


ధనస్సు


 మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం ప్రతికూలతలు అధికం. మనస్సు చికాకుగా ఉంటుంది. ఏ విషయంపై ఆసక్తి వుండదు. ఆలోచనలతో సతమతమవుతారు. స్థిమితంగా వుండటానికి ప్రయత్నించండి. ఖర్చులు విపరీతం. రావలసిన ధనం సమయానికి అందదు. సాయం అర్థించేందుకు మనస్కరించదు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. అకారంణంగా మాటపడవలసి వుంటుంది. శుక్ర శనివారాల్లో అప్రమత్తంగా వుండాలి. సన్నిహితులతో కాలక్షేపం చేయండి. ఈ చికాకులు తాత్కాలికమే. ఆప్తుల సాయంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. వ్యాపకాలు అధికమవుతాయి. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు ఏమంత ఫలతమీయవు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ఉపాధి పథకాలు అంతంత మాత్రంగా సాగుతాయి. వాహన చోదకులకు తగదు. కీలక పత్రాలు అందుకుంటారు.


Capricorn


ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు కార్యం సిద్ధిస్తుంది. ప్రతి విషయంలోనూ మీదే పై చేయి. వ్యతిరేకులను సైతం ఆకట్టుకుంటారు. అభియోగాలు తొలగిపోగలవు. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది వుండదు. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. ఆది, మంగళ వారాల్లో కొత్త సమస్యలెదురవుతాయి. దూకుడుగా వ్యవహరించవద్దు. లౌక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి. మీ శ్రీమతి తీరును గమనించి మెలగండి. ఆరోగ్యం స్థిరంగా వుంటుంది. స్థిరాస్తి కొనుగోలు దిశగా ఆలోచనలుంటాయి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిన్న వ్యాపారులకు ఆశాజనకం. న్యాయ, వైద్య, సాంకేతిక రంగా వారికి ఆదాయాభివృద్ధి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.


మకరం


ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు ఈ వారం ఆశాజనకం. కష్టానికి తగిన ప్రతిఫలం అందుకుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. సలహాలు, సాయం ఆశించవద్దు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఇతరులను మీ విషయలకు దూరంగా వుంచండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. గత సంఘటనలు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగస్తులకు యూనియన్‌లో గుర్తింపు లభిస్తుంది. పదవులు అందుకుంటారు. ఉపాధి అవకాసాలు కలిసివస్తాయి.


మకరం


ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు వ్యవహారాలతో తీరిక వుండదు. రుణ ఒత్తిళ్లు మనశ్శాంతి లేకుండా చేస్తాయి. చీటికిమాటికి అసహనం వ్యక్తం చేస్తారు. సోదరుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. పనులు మొండిగా పూర్తి చేస్తారు. అవకాశాలు అందినట్టే చేజారిపోతాయి. ప్రతిభకు ఏమంత గుర్తింపు వుండదు. ఖర్చులు విపరీతం. పొదుపుధనం ముందుగానే గ్రహిస్తారు. దంపతుల మధ్య సఖ్యత లోపం. స్థిమితంగా ఉండటానికి ప్రయత్నించండి. అతిగా ఆలోచించవద్దు. వ్యాపకాలు సృష్టించుకోవడం ఉత్తమం. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. నూతన వ్యాపారాలు కలిసిరావు. ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ప్రైవేట్ సంస్థ ఉద్యోగస్తులకు కష్టకాలం. ప్రయాణం విరమించుకుంటారు.


Aquarius


 ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు ప్రతికూలతలు అధికం. ఆలోచనలతో సతమతమవుతారు. మనశ్సాంతి వుండదు. స్థిమితంగా ఉండటానికి ప్రయత్నించండి. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. ఆదాయ వ్యయాలకు పొంతన వుండదు. దుబారా ఖర్చులు విపరీతం. పట్టుదలతో శ్రమించినా గాని పనులు పూర్తి కావు. బుధ, గురువారాల్లో పత్రాలు, నగదు జాగ్రత్త. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. సంతానం మొండితనం చికాకు పరుస్తుంది. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఏ విషయాన్ని తీవ్రంగా పరిగణించవద్దు. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో శుభవార్తలు వింటారు. గృహమార్పు కలిసివస్తుంది. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యం. ఉపాధ్యాయులకు ఓర్పు ప్రధానం. ముఖ్యులతో ఒకరికి వీడ్కోలు పలుకుతారు.


కుంభం


 ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు వ్యవహారాలతో తీరిక వుండదు. రుణ ఒత్తిళ్లు మనశ్శాంతి లేకుండా చేస్తాయి. చీటికిమాటికి అసహనం వ్యక్తం చేస్తారు. సోదరుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. పనులు మొండిగా పూర్తి చేస్తారు. అవకాశాలు అందినట్టే చేజారిపోతాయి. ప్రతిభకు ఏమంత గుర్తింపు వుండదు. ఖర్చులు విపరీతం. పొదుపుధనం ముందుగానే గ్రహిస్తారు. దంపతుల మధ్య సఖ్యత లోపం. స్థిమితంగా ఉండటానికి ప్రయత్నించండి. అతిగా ఆలోచించవద్దు. వ్యాపకాలు సృష్టించుకోవడం ఉత్తమం. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. నూతన వ్యాపారాలు కలిసిరావు. ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ప్రైవేట్ సంస్థ ఉద్యోగస్తులకు కష్టకాలం. ప్రయాణం విరమించుకుంటారు.

 


కుంభం


ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు సంప్రదింపులతో హడావుడిగా వుంటారు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. పెద్దల సలహా పాటిస్తారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆశించిన సంబంధం తప్పిపోతుంది. మనోధైర్యంతో ముందుకు సాగండి. ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవద్దు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. సంతానం వైఖరి చికాకు పరుస్తుంది. ఓర్పుతో మెలగండి. గృహ ప్రశాంతతను భంగపరుచుకోవద్దు. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. విద్యార్థులకు ఒత్తిడి అధికం. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. వృత్తి ఉపాది పథకాల్లో నిలదొక్కుకుంటారు. విద్యార్థులకు ఒత్తిడి అధికం. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. కార్మికులకు పనులు లభిస్తాయి. పుణ్యకార్యంలో పాల్గొంటారు.


Pisces


 పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి లక్ష్యం సిద్ధిస్తుంది. కొత్త పరిచయాలేర్పడతాయి. వ్యూహాత్మకంగా అడుగువేస్తారు. ఆదాయం సంతృప్తికరం. రోజువారీ ఖర్చులే వుంటాయి. పెద్దమొత్తం ధనసాయం తగదు. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. శుక్ర, శనివారాల్లో కొత్త వ్యక్తులతో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. సంప్రదింపులకు అనుకూలం. మీ శ్రీమతి సలహా పాటించండి. గృహ మరమ్మతులు చేపడతారు. పత్రాల రెన్యువల్‌లో మెలకువ వహించండి. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. సంతానం పై చదువులపై మరింత శ్రద్ధ వహించాలి. సంస్థల స్థాపనలకు అనుమతులు మంజూరవుతాయి. ఉపాధ్యాయులకు పురస్కార యోగం. ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. కళ, క్రీడాకారులకు ప్రోత్సాహకరం.


మీనం


పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి అనుకూలతలున్నాయి. శుభకార్యం తలపెడతారు. బంధుత్వాలు బలపడతాయి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆదాయానికి తగినట్లు ఖర్చులుంటాయి. పెట్టుబడులు కలిసిరావు. పసులు సకాలంలో పూర్తి చేస్తారు. సోమ, మంగళ వారాల్లో ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. నమ్మకస్తులే మోసగించేందుకు ప్రయత్నిస్తారు. ఫోన్ సందేశాల పట్ల అప్రమతంగా వుండాలి. ప్రలోభాలకు పోవద్దు. ఆత్మీయులకు ముఖ్య సమాచారం అందిస్తారు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. ఆస్తి వివాదాలు కొలిక్కివస్తాయి. నిరుద్యోగులకు శుభయోగం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. కంప్యూటర్ రంగాల వారికి ధనయోగం. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. పెద్దమొత్తం సరుకు నిల్వ తగదు.


మీనం


 పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి ఈ వారం అనుకూలదాయకమే. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ప్రముఖుల ప్రశంసలు అందుకుంటారు. ఖర్చులు అదుపులో వుండవు. మీ ఉన్నతిని చాటుకోవటానికి విపరీతంగా వ్యయం చేస్తారు. గృహం సందడిగా వుంటుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. మీ సలహా ఉభయులకు ఆమోదయోగ్యమవుతుంది. అవివాహితుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. అపరిచితులు మోసగించే ఆస్కారం వుంది. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. వృత్తి ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపార లావాదేవీలతో తీరిక వుండదు. చిన్న వ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తులకు శుభయోగం. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.


Feb-2023


మేషం


అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం వ్యవహారాలు అనుకూలిస్తాయి. కార్యం సిద్ధిస్తుంది. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. రుణ ఇబ్బందులు తొలగుతాయి. ఖర్చులు అధికం. డబ్బుకు లోటుండదు. తలపెట్టిన పనులు నిరాటంకంగా సాగుతాయి. పదవులు, బాధ్యతల నుంచి తప్పుకుంటారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. పొగిడే వ్యక్తులతో జాగ్రత్త. కీలక పత్రాలు అందుకుంటారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. సంతానం చదువులపై శ్రద్ధ వహించండి. వ్యాపారాల్లో ఆటంకాలు తొలగుతాయి. పెట్టుబడులకు అనుకూలం. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. ఉపాధి పథకాలు చేపడతారు. వృత్తుల వారికి సామాన్యం. భూవివాదాలు పరిష్కారమవుతాయి.


వృషభం


 

కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు లక్ష్యసాధనకు మరింత శ్రమించాలి. వ్యాఖ్యలు, విమర్శలు పట్టించుకోవద్దు. స్వశక్తితోనే అనుకున్నది సాధిస్తారు. మీ పట్టుదల స్ఫూర్తిదాయక మవుతుంది. ఖర్చులు అదుపులో ఉండవు. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అయిన వారి ప్రోత్సాహం ఉంటుంది. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. ఆప్తుల ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు పూర్తవుతాయి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. గృహమార్పు అనివార్యం. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆధ్మాత్మికత పెంపొందుతుంది. నిరుద్యోగులకు శుభయోగం. అధికారులకు కింది స్థాయి సిబ్బందితో ఇబ్బందులెదురవుతాయి. వేడుకకు హాజరవుతారు. మీ బలహీనతలు అదుపునలో ఉంచుకోండి.


మిధునం


మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1,2,3 పాదాలు ఈ మాసం అనుకూలదాయకమే. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. వాయిదా పడుతూ వస్తున్న పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. గృహమార్పు అనివార్యం. విలువైన వస్తువులు జాగ్రత్త. వ్యాపకాలు అధికమవుతాయి. పదవులు స్వీకరిస్తారు. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. కీలక పత్రాలు అందుకుంటారు. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. ఒక ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. భవన కార్మికులకు కష్టకాలం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటుపోట్లను అధిగమిస్తారు. అక్కౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం.


కర్కాటకం


పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష గ్రహాల సంచారం అంత అనుకూలంగా లేదు. ఆచితూచి వ్యవహరించాలి. భేషజాలు, మొహమ్మాటాలకు పోవద్దు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. దుబారా ఖర్చులు విపరీతం. పనులు మొండిగా పూర్తి చేస్తారు. సన్నిహితులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. అవివాహితులకు శుభవార్తా శ్రవణం. గృహ మరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. సందేశాలు, ప్రకటనలు నమ్మవద్దు. అజ్ఞాత వ్యక్తులు మోసగించేందుకు యత్నిస్తారు. ఆరోగ్యం సంతృప్తికరం. యోగ, ధార్మికతల పట్ల ఆసక్తి పెంపొందుతుంది. కొత్త పరిచయాలేర్పడతాయి. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉపాధ్యాయులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు.


సింహం


 మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం కార్యసిద్ధికి కృషి, పట్టుదల ప్రధానం. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. సలహాలు, సాయం ఆశించవద్దు. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు నిరుత్సాహపరుస్తాయి. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. ఆత్మీయుల కలయిక ఉత్సాహపరుస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మధ్యవర్తులను విశ్వసించవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. సంతానం విషయంలో శుభం జరుగుతుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపచేస్తుంది. అయిన వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఆడిట్, అక్కౌంట్స్ రంగాల వారికి చికాకులు అధికం. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. యాదృచ్ఛికంగా తప్పులు దొర్లే ఆస్కారం ఉంది. వేడుకకు హాజరు కాలేరు.


కన్య


ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. మీ కష్టం వృధా కాదు. వ్యవహార జయం, ధనలాభం ఉన్నాయి. ఊహించిన ఖర్చులే ఉంటాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. మీ జోక్యం అనివార్యం. పనులు సానుకూలమవుతాయి. పత్రాలు, ఆహ్వానం అందుకుంటారు. మీ శ్రీమతితో అనునయంగా మెలగండి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ఇంటి విషయాలపై మరింత శ్రద్ధ వహించాలి. పాత పరిచయస్తులు తారసపడతారు. పెట్టుబడులకు తరుణం కాదు. బంధుమిత్రులు ధనసహాయం అర్థిస్తారు. కొంత మొత్తం సాయం అందించండి. ఉద్యోగస్తులకు పనియందు ధ్యాస ప్రధానం. ఉపాధ్యాయుకు ఒత్తిడి అధికం. వ్యాపారాభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఉపాధి పథకాలు చేపడతారు. ఆధ్మాత్మికత పెంపొందుతుంది. దైవకార్యాల్లో పాల్గొంటారు.


తుల


చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు ఈ మాసం శుభదాయకమే. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. వేడుకను ఘనంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఖర్చులు భారమనిపించవు. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన శ్రేయస్కరం. స్వల్ప అస్వస్థతకు గురువుతారు. వైద్యసేవలు అవసరమవుతాయి. గృహమార్పు కలిసివస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. ఉద్యోగసులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. సరుకు నిల్వలో జాగ్రత్త. వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. విద్యార్థులకు ఏకాగ్రత లోపం. వాహనదారులకు దూకుడు తగదు.


వృశ్చికం


 

విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట వ్యవహారదక్షతతో రాణిస్తారు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. వ్యవహారానుకూలత, వస్త్రప్రాప్తి ఉన్నాయి. రావలసిన ధనం అందుతుంది. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. దంపతులకు కొత్త ఆలోచనలొస్తాయి. సంతానం చదువులపై మరింత శ్రద్ధ వహించాలి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి. జాతక పొంతన ప్రధానం. మీ అభిప్రాయాలను సున్నితంగా తెలియజేయండి. గృహమార్పు అనివార్యం. విలువైన వస్తువులు జాగ్రత్త. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. వృత్తి ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. అప్రియమైన వార్తలు వినవలసి వస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు.


ధనస్సు


 

మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం మీదైన రంగంలో రాణిస్తారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ఆదాయం బాగుంటుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. విలాసాలకు వ్యయం చేస్తారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆప్తులను వేడుకలు, విందులకు ఆహ్వానిస్తారు. గృహం సందడిగా ఉంటుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. సంతానం కదలికలపై దృష్టి సారించండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. సన్నిమితుల సలహా పాటించండి. దంపతుల మధ్య దాపరికం తగదు. వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. చిన్న వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. ఉద్యోగ బాధ్యతల్లో ఏమరుపాటు తగదు. భవన నిర్మాణాలు ఊపందుకుంటాయి. కార్మికులకు పనులు లభిస్తాయి.


మకరం


ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు ఈ మాసం కొంత మేరకు అనుకూలదాయకం. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆత్మీయులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. పనులు వేగవంతమవుతాయి. పదవులు, సభ్యత్వాలకు యత్నాలు సాగిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. పట్టుదలకు పోవద్దు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆహ్వానం అందుకుంటారు. పరిచయాలు బలపడతాయి. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. ఆబాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. వృత్తి ఉపాధి పథకాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు.


కుంభం


ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు ఆర్థిక వ్యవహారాలతో తీరిక ఉండదు. పణాళికలు రూపొందించుకుంటారు. అంచనాలు ఫలించవు. ధనసమస్యలెదురవుతాయి. అవసరాలకు ధనం సర్దుబాటవుతుంది. వివాహ యత్నం ఫలించే సూచనలున్నాయి. జాతక పొంతన ప్రధానం. బంధుమిత్రులతో సంప్రదింపులు జరుపుతారు. పనులు అర్థాంతంగా ముగించవలసి వస్తుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. గృహ నిర్మాణాలకు అనుమతులు మంజూరవుతాయి. ఆరోగ్యం సంతృప్తికరం. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నూతన వ్యాపారాలకు అనుకూలం. వృత్తి, ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది.


మీనం


పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి సంకల్పసిద్ధికి ఓర్పు ప్రధానం. యత్నాలు విరమించుకోవద్దు. మీ కష్టం నిదానంగా ఫలిస్తుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు. ఏ విషయాన్నీ తీవ్రంగా భావించవద్దు. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో పరిస్థితులు అనుకూలిస్తాయి. కొత్త పనులు చేపడతారు. గృహమార్పు కలిసివస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. సొంత పరిజ్ఞానంతో మందులు వేసుకోవద్దు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. బంధుమిత్రులు మీ అశక్తతను అర్ధం చేసుకుంటారు. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. న్యాయ, సాంకేతిక రంగాల వారికి ఆదాయం బాగుంటుంది. నిరుద్యోగులు ఇంటర్వూల్లో విజయం సాధిస్తారు. విద్యార్థులకు ఒత్తిడి, చికాకులు అధికం.


2023


మేష రాశి


మేష రాశి 2022 -2023

అశ్విని -1,2,3,4 పా ,భరణి-1,2,3,4 పా , కృత్తిక-1 పాదం

ఆదాయం -14 , వ్యయం -14  రాజపూజ్యం -3 , అవమానం -6

ఈ రాశివారలకు ధనము, కుటుంబమునకు కారకుడైన గురుడు 12 ఇంటనూ, రాజ్యలాభాధిపతైన శని దశమ కేంద్రంలో, రాహుకేతువులు జన్మం, సప్తమంలో సంచరిస్తున్నందున మిశ్రమంగా ఉంటుందని చెప్పవచ్చును. మంచి చెడులు సమానంగా ఉండును. మీలో ఎన్ని రకములుగా శక్తి సామర్ధ్యములున్నా ముందుకు వెళ్లలేకుండుట జరుగును అకారణముగా మాటలుపడుట, రావలసి బాకీలు, ఆదాయమునకు అంతరాయం కలుగుట, లోలోపల అధైర్యంఏర్పడు ను రక్తబంధువర్గంలో కలతలు, అశాంతి, రీత్యా మనస్సుకు ఉత్సాహం లేకుండుట, గుప్త శత్రుబాధలు ఏర్పడును. స్వవిషయంలో కంటే ఇతరుల పనులలో శ్రద్ధ చూపుతారు. లేనిపోని అవమానాలకు మనస్సు లోనగుట. మీసొమ్ముతిని ఉపకారం పొందినవారే శత్రువులుగా పరిణమించుట కలుగును. పుణ్యక్షేత్ర సంచారం పెద్దలను సేవించుట, గృహమార్పులు, ప్రయాణములలో ఒత్తిడి, భీతి, కలవరం శరీరమున తెలియని వ్యాధిగా ఉండి ఔషధ సేవలు చేయుట చోరభయం, గృహంలో శుభకార్యాలు తప్పక జరుగును శుభ మూలక ధనవ్యయం.కుటుంభంలో భార్య భర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు ఏర్పడును. ఇద్దరూ పట్టుదలకు పోవుటచే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇద్దరూ సమన్వయంతో ఉండిన కష్టాలనుండి గట్టెకుదురు. తరుచు ప్రయాణాలు, కొంతమందికి షుగరు, బి.పి.వంటి రోగాలు వచ్చును.

ఈ సంవత్సరం ఉద్యోగులకు మిశ్రమంగా ఉంటుంది. ఆదాయంనకు లోటుండదు. కానీ ధనవ్యయం అధికంగా ఉండును. ఋణములు చేయవలసి వచ్చును. రాహుప్రభావం వలన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వములందు పనిచేయు ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు జరుగును. మీకు రావలసిన ప్రమోషన్స్ ఇతరులకు పోవును. అధికారులు వలన మాటలు పడుదురు. నిరుద్యోగులకు కొంతమేర ఫర్వాలేదు. టెంపరరీ ఉద్యోగం అయినా దొరుకును.పర్మినెంటు కాని వార్కి ఈ సంవత్సరం పర్మినెంటు కాదు. కార్మికులకు కొంత ఉపశమనం కల్గించును.

రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం అంత అనుకూలత ఉండదు.రాహు ప్రభావం వల్ల అధిష్టానంలోనూ , ప్రజలలోను కొంతమేర గౌరవం కలుగును. ప్రతిపక్షం వారు మీపై నింధారోపణలు చేయుదురు . ఎన్నికలలో పొటి చేసినట్లుయిన ఓటమి పాలగుదురు . ఏ విధమైన పదవులు లభించుక నిరాశ ఎదురగును .

కళాకారులకు మంచి ఫలితాలే ఉంటాయి. సినిమా టి.వి.రంగాలలో ఉన్న వార్కిమి యొక్క ప్రోగ్రామ్స్ ప్రజలలో మంచి ఆదరణ పొందును. టెక్నిషియన్స్న కవులు, గాయకులు, డైరెక్షన్స్, నటీనటవర్గమునకు నూతన అవకాశాలు బాగానే వచ్చును. ఈ సం॥రం అవార్డులు, రికార్డులు మాత్రం లభించుట కష్టమగును.

ఈసం॥రం అన్నిరకాల వ్యాపారులకు సామాన్యంగా ఉంటుంది. లాభనష్టాలు సమానం. చిరువ్యాపారులకు ఓమాదిరిగా ఉంటుంది. రైసుమిల్లలు లాభించును. ఫైనాన్సు రంగంలో ఉన్నవార్కి ప్రభుత్వ సంబంధ ఇబ్బందులు, ఇన్‌కంటాక్స్ తనిఖీలు, సరుకులు నిల్వ చేయువారికి లాభించును. రియల్ ఎస్టేటు రంగంలో ఉన్నవార్కి అనుకూలం. జాయింటు వ్యాపారులు విడిపోవుదురు. ఇనుము, ఇసుక, ఇటుక వ్యాపారులు బాగా లాభించును. కాంట్రాక్టుదారులకు కొంత ఇబ్బంది.

ఈ సంవత్సరం విద్యార్ధులకు గురుడు వ్యయమందు ఉన్నప్పటికీ పరీక్షలు బాగానే వ్రాయుదురు. ఆశించిన మార్కులు పొందలేరు. చదువు పై ధ్యాస ఉన్నప్పటికీ జ్ఞాపకశక్తి తగ్గును. ఇంజనీరింగ్, మెడికల్, పాలిటెక్నిక్, ఆసెట్, ఐసెట్, ఈసెట్, బి.ఇడి. లాసెట్, ఐటి మొ॥గు ఎంట్రన్స్ పరీక్షలు వ్రాయువారు చివరిక్షణంలో సీట్లను పొందగలరు. క్రీడాకారులకు విజయాలు లభించిన ముందుకు పోలేరు.

ఈ సంవత్సరం వ్యవసాయదారులకు మిశ్రమఫలితాలు. ఒక పంట బాగుండి రెండవ పంట దిగుబడి తగ్గుటచే నష్టపోవుదురు. కౌలుదారులకు నష్టములు తప్పవు. పూలు, నిమ్మ, పండ్లతోటలు చేయువారికి అనుకూలత. చేపలు, రొయ్యల - చెరువులు వారికి ఆదాయం తక్కువ. పౌల్ట్రీలునడుపువార్కి ఆదాయం బాగుంటుంది.

స్త్రీలకు: ఈ సంవత్సరం అంత అనుకూలంగా ఉండదు. గురుబలం లేదు. జన్మ రాహువు వలన అపనిందలు వచ్చును. ప్రతీ చిన్న విషయానికి కలవరం చెందుదురు. మీ పేరుతో ఉన్న ఆస్తులు అమ్మవలసివచ్చును. శుభమూలక ధన వ్యయం వల్ల గృహంలో శుభకార్యాలు చేయుదురు. భార్య భర్తల మధ్య సరైన అవగాహన ఉండదు. ఉద్యోగం స్త్రీలకు సుదూర ప్రాంతములకు బదిలీలు జరుగును . అదికారుల వల్ల ఇబ్బందులు . వివాహం కానీ స్త్రీలకు ఈ సంవత్సరం మొత్తం మీద ఈ రాశి స్త్రీ , పురుషులకు మధ్యస్తముగానే ఉంటుంది. మీ తెలివితేటలు ఎంతగా ఉన్న పనికిరాకుండా పోవును . మీరు ఊహించింది ఒకటి జరిగేది ఇంకొకటిల ఉంటుంది. దైవ బలం కూడా అనుకూలించదు .

చేయవలసిన శాంతులు : ఈసం॥రం గురు, రాహు ,కేతువులు స్టితులు అనుకూలంగా లేనందున , జపం , హొమం చేయించండి. లలితా పీఠంలో గురు , మంగళవారాలలో రుద్రాభిషేకం చేయించి నియమాలు పాటించండి . లలితా పీఠంలో జాగారం చేయండి లేదా గురు ,రాహు ,కేతు యంత్రాలు ధరించిన మంచిది.


వృషభం


వృషభ రాశి

కృత్తిక 2,3,4 పా రోహిణి 1,2,3,4, పా మృగశిర 1,2 పా॥లు

ఆదాయం - 8 వ్యయం-8  రాజపూజ్యం - 6 అవమానం - 6

ఈ రాశిగల వారికి ధనము, కుటుంబము, సంపత్తునకు కారకుడైన గురుడు లాభరాశియందు, యోగకారకుడైన శని భాగ్యమందు స్వక్షేత్రములో ఉన్నందు వల్ల గ్రహాలు యోగస్థానాలందు ఉండుటచే ఎలాంటి కార్యమైన అవలీలగా సాధించ గలరు. స్త్రీలవల్ల గౌరవాదులు, గృహంలో వివాహాది శుభకార్యములు జరుగుట. ఇదివరకు సాధించలేని పనులు తన ఆధీనములోనికి తెచ్చుకొనుట జరుగును. రాహు ప్రభావంచే స్థల మార్పులు, గృహ మార్పులు జరుగును. సంతానము రీత్యా అనందము. సాంఘికంగా గౌరవ మర్యాదలు, పెద్దల అనుగ్రహము లభించును. పలుకుబడిని వృద్ధిపరచు సంఘటనలు కలుగును. 12వ ఇంట రాహువు వలన దుష్టుల సాంగత్యం, పాత గృహములో మార్పులు చేయుట, దూర ప్రయాణాలు, తీర్థయాత్రలు చేయుదురు. ఆప్తబంధు మిత్రులను పోగొట్టుకుంటారు. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన, కానీ ఒక్కో సమయాన చిన్న చిన్న గొడవలు అయినా పెద్దగా ఇబ్బందులుండవు. చేయు పనులయందు శ్రమ అధికం. అభివృద్ధి కొరకు ఋణములు చేయుదురు. స్థిరాస్తులు అమ్ముటకు ప్రయత్నించినా అమ్మలేరు. ప్రతీ విషయంలో చాలా ధైర్యంగా ముందుకు పోగలరు. గ్రహబలం బాగుండుటచే ఎంతటి కార్యమునైనా సాధించగలరు. కళత్ర, పితృ, మాతృ వంశ సూతకములు ఈ కల్గును. విలువైన వస్తువులు పోగొట్టుకుంటారు. నూతన వాహనం కొనితీరుదురు.

ఈ సంవత్సరం ఉద్యోగులకు మంచి కాలమనే చెప్పవచ్చును. అధికారులతో సత్సంబంధాలుంటాయి. మీరుచేయు పనులనుగుర్తించెదరు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ములందుపనిచేయువారలకు ప్రమోషన్స్ తో కూడిన బదిలీలు. వాహనప్రాప్తి , గృహనిర్మాణాలు . ప్రైవేట్ కంపెనీలలో పనిచేయువారు మరొక కంపెనీకి అధికజీతంతో మారుదురు. పెర్మినెంటుకాని ఉద్యోగులకు ఈ సం//రం పెర్మినెంట్ అగును. నిరుద్యోగులు కచ్చితంగా ఈ సం//రం జీవితం స్తిరత్వం పొందగలరు . కార్మికులకు ,చిరుద్యోగులకు పర్వాలేదు అనిపించిన. ఈ సం//రం ఏ రంగంలో ఉన్న ఉద్యోగులకైనా బాగుంటుంది.

ఈ సంవత్సరం రాజకీయ నాయకులకు లాభదాయకం , అన్నీ విధాలుగా యోగించును. ప్రజలలో మంచి పేరుప్రఖ్యాతలు . అధికార వర్గంలోను ప్రత్యేక గుర్తింపు . పార్టీ పరంగా కానీ , ప్రభుత్వ రీత్యాగాని ఏదో ఒకపదవి వచ్చును . ఎన్నికలో పోటీ చేసిన విజయం మీదే అగును . రాహు ప్రభావం వల్ల అధికధనవ్యయం జరుగును.

ఈ సంవత్సరం కళాకారులకు గ్రహబలం బాగుంది. సినిమాటి.వి.రంగాలలో ఉన్నవారందరికి అనుకూలమే. నూతన అవకాశాలు విరివిగా వచ్చును. గాయనీ గాయకులు, నటీనటవర్గం, టెక్నీషియన్స్, దర్శక, రచయితలకు బాగుంటుంది. ప్రభుత్వ , ప్రైవేట్ సంస్థల అవార్డులు , రివార్డులు మరియు మీకు ప్రత్యేక గుర్తింపు.

ఈ సంవత్సరం అన్నిరకాల వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది. హోల్సేల్, రిటైల్ వ్యాపారులకు, సరుకులు నిల్వచేయువారలకు, రియల్ ఎస్టేటు చేయువారి బిల్డింగ్ నిర్మాణరంగం ఉన్నవార్కి మంచిలాభాలు. ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి, బంగారం, వెండి వ్యాపారులకు అనుకూలమే. జాయింట్ వ్యాపారులకు, కాంట్రాక్టర్లుకు చాలా బాగుంటుంది. షేర్ మార్కెట్లో ఉన్నవార్కి రైసుమిల్లలు అనుకూలమే.

ఈ సం||రం విద్యార్దులకు గురుబలం బాగుంది. పరీక్షలలో మంచి మార్కులతో ఉత్తీర్ణులగుదురు  అనుకున్నది సాధించెదరు. ఇంజినీరింగ్ , మెడికల్ ,ఆసెట్, ఇసెట్, లాసెట్, బి.ఇడి., పాలిటెక్నిక్ మొదలగు ఎంట్రెన్స్ పరీక్షలలో మంచి ర్యాంకులు పొంది మీరు కోరుకున్న కాలేజీలలో సీట్లను పొందగలరు. క్రీడలలో ఉన్న వారికి మంచి విజయాలు లభించును. జాతీయ, అంతర్జాతీయ జట్లలో ఎంపిక కాగలరు.

వ్యవసాయదారులకు ఈ సంవత్సరం బాగుంటుంది. రెండు పంటలు మంచి దిగుబడి, మంచిధరవల్లమంచిలాభాలు కలుగును.గతంలో చేసినఋణాలు తీర్చెదరు. కౌలుదార్లకుమంచిలాభమే. ప్రభుత్వ సహాయం లభించును.గృహంలో వివాహాది శుభ కార్యాలు జరుగును. చేపలు, రొయ్యల చెరువులు చేయువార్కి విశేషలాభాలు. నర్సరీ,పూలు రైతులకు విశేషంగాలాభించును. పౌల్ట్రీరంగంలో ఉన్నవార్కిధరలు పెరుగుట.

స్త్రీలకు :- ఈ సంవత్సరం మీమాటకు ఎదురులేదు. కుటుంబంలో అందరూ మీ మాటప్రకారం నడుచుకుంటారు. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన. మీ పేరుతో గృహం లేదా స్థలం ఏర్పడును. శుభకార్యాలు చేస్తారు. ఉద్యోగములు చేయు వార్కి ప్రమోషన్సతో కూడిస బదిలీలు. పైఅధికారులతో సఖ్యత . వివాహం కానీ ఈ సం//రం తప్పక వివాహంజరిగి తీరును. గర్భిణీ స్త్రీలకు ఫ్రీ డెలివేరి గురుడు బలియంగా ఉన్నందున ఆ పుత్ర సంతానం కలుగును . మొత్తం మీద ఈ సంవత్సరం స్త్రీ , పురుషాదులకు మంచి యోగదాయకంగా ఉంటుంది. గ్రహబలంతో పాటు దైవ బలం కూడా ఉండుటచే మీ ధైర్య సాహసాలకు సరైన ఫలితాలు పొందుటలో సందేహం లేదు.ధైర్యంగా ముంధుకు పోగలరు .

చేయువలసిన శాంతులు : గ్రహస్తితి బాగుండుటచే మీ పై ఎక్కువ గా ఈర్ష్య , అసూయ , ద్వేషం , నరగోష ఉంటుంది . మంగళవారం లలితా పీఠంలో రుద్రాభిషేకం చేయండి. లలితా పీఠంలో మంగళవారం రోజున జగర్ణ చేయండి . నవగ్రహ , రాహుగ్రహ యంత్రాలు ధరించిన మంచిది.


మిధునం


మిధున రాశి

మృగశిర 3,4 పాదములు ఆరుద్ర 1,2,3,4 పాదములు పునర్వసు 1,2,3 పాదములు

ఆదాయం-11 వ్యయం-5 రాజపూజ్యం-2 అవమానం-2

ఈ రాశిస్త్రీ, పురుషులకు ధనం, కుటుంబం, సంపద, సంతానం, గౌరవాదులకు కారకుడైన గురుడు 10వ ఇంట, 11వ ఇంట రాహువు, 8వ ఇంట శని ఉన్నప్పటికీ అంతగా హానిచేయడు. మీలో గల మనోభావములు ఫలించును. పెద్దలు, హోదా గల వ్యక్తులతో పరిచయం.సాంఘికం గా గొప్ప హుందా, పేరు ప్రఖ్యాతలు, వాహనసుఖం పొందుట. అధికారము వహింపగల శక్తి సామర్థ్యాలు ఏర్పడును. మీరు పట్టిందల్లా బంగారమా? అన్నట్లు ఉండును. కుటుంబములలో ఉన్నతస్థాయిని పెంపొందించు కొనుట జరుగును. పాత గృహంలో మార్పులు, లేదా స్థలంకొని స్థిరాస్తి నివృద్ధి చేయుట, గత సంవత్సరములలో పొందని ఊహించని సంఘటనలు, యాత్రా ఫలసిద్ధి, గుప్తశత్రుబాధలు అంతరించుటకలుగును. స్త్రీ పురుషాదులచే మనోవాంఛా  ఫలసిద్ధి కలుగును. ఏ చిన్న కార్యంలోనైనా వ్యతిరేకమనుకున్నది ఉపకారముగా పరిణమించును. గృహములో వివాహాది శుభకార్యములు జరుగును. పుణ్యక్షేత్ర సంచారము కలుగును. నూతన కార్యములకు శ్రీకారం చుట్టెదరు. రక్త బంధుపీడలు కలిగినా తగ్గును. గతంలో శత్రువులుగా ఉన్నవారు మిత్రులగుదురు. మీ యొక్క నూతన ఆలోచనలతో కుటుంబ గౌరవాదులు చేకూరును. ఏ విషయంతోనైనా అధైర్యంచెందక ముందుకు ధైర్యంతో వ్యవహరించేది. మీ యొక్క సంస్కారము అట్టిది. ఇతరులకు మంచి సలహాలు ఇచ్చెదరు. స్థిరాస్తి వృద్ధి చేయుట లేదా ధనమును బ్యాంకులలో డిపాజిట్ చేయుట నూతన వాహనం కొనుట. కానీ అష్టమ శని ప్రభావం వలన అధైర్యంగా ఉండవలసి వచ్చును. కానీ పనులు మాత్రము ధైర్యంతో చేసి ముందుకు పోగలరనుటలో సందేహము లేదు. దైవబలం కూడా కలిసివచ్చును.

ఈసంవత్సరం ఉద్యోగులకు అన్నివిధాలుగా అనుకూలం. రాహుబలం బాగుంది. కోరుకున్న చొట్లకు బదిలీలు. ప్రమోషన్స్ రావు , కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వములందు పనిచేయువారలకు శని ప్రభావం కొంత కనిపించును. అధికారులతో ఇబ్బందులు. గృహ నిర్మాణాది పనులు పూర్తి అగును. స్త్రీల మాట సహాయం వల్ల లబ్దిని పొందగలరు. ప్రైవేట్ , సాఫ్ట్వేర్ రంగాలలో పనిచెయువారుకు యేగమే . నిరుద్యోగులకు ఆశాజనకంగా ఉండును. కార్మికవర్గం వార్కి మధ్యస్థంగా ఉండును.

ఈ సంవత్సరం రాజకీయ నాయకులకు రాహుబలంచే మిశ్రమ ఫలితాలు గురుబలం ఫర్వాలేదు. అష్టమ శని ప్రభావం వల్ల శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. అధిష్టాన వర్గంలో మీ పేరు ప్రఖ్యాతలు బాగుండును . మీకు రావలసిన పదవులు చివరి నిమిషంలో చేజారిపోవును. మొండిగా వ్యవహరించాలి . ఏదైనా పార్టీ పదవి తప్పక లభించును.

కళాకారులకు ఈ సంవత్సరం బాగుంటుంది. దశమంలో గురుని వలన మీ పనికి తగుగుర్తింపు ఉంటుంది. ప్రజలలో గుర్తింపు, ఆదరణ లభించును. సినిమా, టి.వి., నాటక రంగాలలో ఉన్న గాయనీ గాయకులు, టెక్నీషియన్స్, దర్శకులకు, రచయితలకు బాగుంటుంది. ఆదాయం తగ్గును. కానీ అవకాశములు ఎక్కువగా వచ్చును. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల అవార్డులు, రివార్డులు తప్పక లభించును. జీవిత స్థిరత్వం లభించును. గృహనిర్మాణములు కలిసివచ్చును.

అన్ని రకాల  వ్యాపారస్తులకు ఈ సంవత్సరం బాగుంటుంది. 11వ ఇంట రాహువు వలన అనుకున్న వ్యాపారం చేయగలరు. హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులకు అనుకూలమే. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. సరుకులు నిల్వ చేయువారలకు విశేషలాభం. బంగారం, వెండి మొదలగు వ్యాపారులకు చాలా బాగుండును. జాయింటు వ్యాపారులకు భాగస్తులకు మధ్య సరైన అవగాహన ఉండుటచే క్రొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. రియల్ ఎస్టేటు రంగంలో ఉన్న వారికి గత సంవత్సరం కంటే బాగుంటుంది. నూతన ప్రాజెక్టులు చేపట్టుదురు. షేర్ మార్కెట్ లో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. రైసు మిల్లర్స్ కు అనుకూలమే. ప్రభుత్వ నిర్ణయముల వలన లాభించును. బిల్డింగ్ నిర్మాణ రంగంలో ఉన్న వార్కిమంచి వ్యాపారం జరుగును. ప్రైవేటు, ప్రభుత్వ కాంట్రాక్టు పనులు చేయువారలకు బాగుంటుంది. నూతన కాంట్రాక్టులు లభించును.

విద్యార్థులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితం ఉండును. అష్టమ శని ప్రభావం వలన జ్ఞాపకశక్తి కొద్దిగా తగ్గును. అనుకున్న మార్కులు సాధించలేరు. ఉత్తీర్ణులగుదురు. ఇంజనీరింగ్, మెడికల్, ఆసెట్, ఐసెట్, ఈ సెట్, బి.ఇడి., లాసెట్, పాలిటెక్నిక్ మొదలగు ఎంట్రెన్సు పరీక్షలు వ్రాయు వారు మంచి ర్యాంకులు రాకపోయినా సీట్లను పొందగలరు. క్రీడాకారులకు బాగుంటుంది. మంచి విజయాలు లభించును. కేంద్ర, రాష్ట్ర జాతీయ జట్లలో ఎంపిక కాగలరు. వ్యవసాయదారులకు రెండు పంటలు ఫలించును దిగుబడి కూడా బాగుండును ఆదాయ వృద్ధి పొందును కౌలుదార్లకు అనుకూలమే రుణము తీర్చు నర్సరీ ఔషధ మొక్కలు వెయ్యి వారికి విశేష లాభములు పండ్లతోటల వారికి నష్టములు చేపలు రొయ్యల చెరువులు చేయు వారికి విశేష లాభాలు పౌల్ట్రీ రంగంలో ఉన్న వారికి మంచి లాభాలు వచ్చి నిలదొక్కుకుంటారు.

స్త్రీలకు : ఈ సంవత్సరం స్త్రీలకు అనుకూలం. సప్తమాధిపతి గురుడు 10వ ఇంట ఉండటం వలన భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది . కుటుంబంలో అందరూ మీ మాటలకు విలువ ఇస్తారు. మీ మాటకు ఎదురు లేకుండా పోవును .ఇతరులకు కూడా మాట సహాయం చేయుదురు, ఉద్యోగాలలో ఉన్న స్త్రీలకు మాత్రం అష్టమ శని ప్రభావం ఉంటుంది. సుదూర ప్రాంతాలకు బదిలీ జరుగును. గతంలో విడిగా ఉన్న భార్యాభర్తల తిరిగి కలుస్తారు , వివాహం కాని వారికి ఈ సంవత్సరం వివాహం జరుగును,  గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్ ద్వారా డెలివరీ అవును. స్త్రీ సంతానప్రాప్తి. నం కూడా విపరీతంగా ఖర్చు అవును.  మొత్తం మీద ఈ సంవత్సరం స్త్రీలకు మంచి ఫలితాలే ఉంటాయి. సుఖమైన జీవనంలో లభించును.

మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులకు హాయిగా, సంతృప్తికరంగా సాగును.  మీ యొక్క ధైర్యసాహసములే మీమ్మల్ని ముందుకు నడిపించును . ఎంతటి వారినైనా ఇట్టే ఆకర్షించేదరు. గ్రహబలం తో పాటు దైవబలం కూడా అన్ని విధాలుగా బాగుండును

చేయవలసిన శాంతులు:  ఈ రాశివారికి ఎనిమిదో ఇంట శని ప్రభావం కొంత ఇబ్బందులు, గాన శనివారం మంగళవారం నియమాలు పాటించాలి. మంగళవారములలో లలితా పీఠంలో అమ్మవారిని దర్శించండి లేదా శని , నరఘోష యంత్రాలు ధరించటం మంచిది.


కర్కాటక


కర్కాటకరాశి

 

పునర్వసు 4వ పాదము పుష్యమి 1,2,3,4 పా॥లు ఆశ్రేష 1,2,3,4 పాదములు

ఆదాయం -5 వ్యయం-5  రాజపూజ్యం -5 అవమానం-2

ఈరాశి స్త్రీ పురుషాదులకు గురుడు మీనరాశిలో ఉండుటచాలా యోగదాయకము. సప్తమ, అష్టమాదిపతి శని సప్తమంలో ఉండుట, రాహు, కేతువులు 10,4 స్థానములలో ఉండుట వలన అత్యధిక ప్రాముఖ్యతతో కూడిన జీవితమును గడుపుదురు. రాజకీయంగా, సాంఘికంగా, అన్ని రంగములలో మీదే పైచేయి అన్నట్లుండును. చాతుర్యముతోనూ, పట్టుదలతోను ఎలాంటి వ్యక్తులను గాని, సమస్యలను గాని లెక్కచేయరు. స్త్రీపురుషాదులను వశం చేసుకుని జీవితం గడుపుదురు. వాహనసుఖం. వివాహాదులు జరుగవలసిన వార్కి వారి ఆశయాలకు తగినవారితో సంబంధము ఏర్పడును. ఆడవారి ప్రభావం మీకు సహాయకరం. భార్యఇష్ట ప్రకారం నడుచుకునేది. ఆమె ప్రభావము చేతను విలువైన వస్తువులను సేకరించుట. గృహజీవితానందము. పుణ్యక్షేత్ర దర్శనము. పుణ్యకార్యాలు చేయుటకలుగును. అధికార అనుగ్రహం. సంఘంలో పేరు ప్రతిష్టలు కలుగును. ఏరంగంలో ఉన్నవారికైనా నూతన ఉత్తేజం కలుగును. తాము పట్టింది. బంగారమా? అనునట్లుండును. అప్పుడప్పుడు కుటుంబంలో చిక్కులు కలిగినా అంతగా బాధించవు. బంధువిరో ధములు, ఆదాయం వృద్ధి. గృహములో శుభకార్యములు కలసి వచ్చుట. కోర్టు వ్యవహారములలో జయం కలుగును. మీ శ్రమకు తగ్గ ఫలితం వచ్చును. బంధుమిత్రాదుల కంటే మీ జీవనం చాలా బాగుంటుంది. గురుబలం ఉన్నందున చాలా హాయిగా, ప్రశాంతంగా జీవనం ఉంటుంది.

ఈ సంవత్సరం ఉద్యోగులకు మంచి కాలంగా చెప్పవచ్చును. పనికి తగ్గ గుర్తింపు ఉంటుంది. పై అధికారుల మన్ననలు పొందగలరు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వములందు పనిచేయు అందరికీ అనుకూలత. ప్రమోషన్తోకూడిన బదిలీలు జరుగును. చాలా ఉత్సాహంగా, చురుకుగా  , సంతోషంగా ఉంటారు. నిరుద్యోగులు ఈ సంవత్సరం కచ్చితంగా జీవితంలో స్థిరపడతారు. ఏదో ఒక ఉద్యోగం తప్పక వచ్చును . కాని వారికి ఈ సంవత్సరం ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి పెర్మినెంట్ అవును . జీతములు పెరుగును , యజమానులు మెప్పు పొందుతారు . కార్మికులకు అన్ని విధాలుగా బాగుంటుంది . సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారు మంచి జీతంతో మొత్తం మీద అన్ని రకముల ఉద్యోగస్తులకు మంచి యోగదాయకమైన సంవత్సరం. గృహనిర్మాణములు  కలిసి వచ్చును.

ఈ సంవత్సరం రాజకీయ నాయకులు యోగదాయకమైన సంవత్సరం. పేరు ప్రఖ్యాతులు పెరుగును.  ప్రజలలో మంచి గుర్తింపు ఉంటుంది.  అధిష్టానవర్గంలోనూ మీకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది.  పార్టీపరంగా గాని,  ప్రభుత్వంలో మంచి హోదా కలిగిన పదవులు తప్పక లభించును . ఎన్నికల్లో పోటీ చేసినట్లయిన మీదేవిజయం.  

కళాకారులకు ఈ సంవత్సరం గురుబలం బాగుంది. జీవితంలో ఉన్నత స్థితికి వచ్చెదరు. టి.వి., సినిమా రంగంలో ఉన్న దర్శకులు, గాయనీ గాయకులకు టెక్నీషియన్స్, రచయితలకు మంచి విజయాలు లభించును. నూతన అవకాశాలెక్కువ లభించును. ఆదాయం ఎక్కువ, గృహ నిర్మాణాలు, నూతన వాహనాలు, ప్రభుత్వం, ప్రైవేటు సంస్థల నుండి అవార్డులు, రివార్డులు లభించును.

ఈ సంవత్సరం వ్యాపారస్థులకు మహోన్నతంగా ఉంటుంది. అన్ని రకముల వ్యాపారులకు చాలా లాభదాయకంగా ఉంటుంది. హోల్ సేల్ మరియు రిటైల్ వ్యాపారములు బాగా సాగును. అనుకున్న వ్యాపారములు జరుగును. కొత్త వ్యాపారములు ప్రారంభిస్తారు. బంగారం, వెండి వ్యాపారులకు, షేర్ మార్కెట్ వార్కి రియల్ స్టేట్ రంగంలో ఉన్న వార్కిమంచి లాభములు. ఫైనాన్స్ రంగంలో ఉన్న వార్కి రైసుమిల్ర్లకు ప్రభుత్వ నిర్ణయాలు వల్ల లాభములు. బిల్డింగ్స్ నిర్మాణ రంగంలో ఉన్న వార్కి అమ్మకములు బాగా జరుగును. ప్రభుత్వం, ప్రైవేటు రంగాలలో ఉన్న కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు లభించి లబ్ధిని పొందగలరు. పెండింగ్ బిల్స్ వసూలగును.

విద్యార్ధులకు ఈ సంవత్సరం బాగుంటుంది. గురుబలం ఉన్నందున చదువుపై శ్రద్ధ ఉంటుంది. పట్టుదలతో చదువుదురు. జ్ఞాపకశక్తి కూడా బాగుండును. పరీక్షలలో మంచి మార్కులతో ఉత్తీర్ణులగుదురు. ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఇంజనీరింగ్, మెడికల్, ఆసెట్, ఐసెట్, ఈ సెట్, లాసెట్, బి. ఇడి., పాలిటెక్నిక్ మొదలగు ఎంట్రన్స్ లందు మంచి ర్యాంకులు వచ్చికోరుకున్న కాలేజీలలో సీట్లను పొందగలరు. క్రీడాకారులకు మంచి విజయాలు లభించును.

వ్యవసాయదారులకు ఈ సంవత్సరం రెండు పంటలు ఫలించును. దిగుబడి బాగుండి, మంచి ధరలు లభించుటచే నిలదొక్కుకుంటారు. ఋణాలు తీర్చెదరు. కౌలుదార్లకు అనుకూలమే. గృహంబులో సంతోషవాతావరణం. పండ్లతోటల వార్కి అంతంత మాత్రమే.కూరగాయలు, పూలు, నర్సరీ , ఔషధమొక్కలు చేయు వార్కి చాలా బాగుంటుంది .చేపలు , రొయ్యల చెరువుల వార్కి లాభాలు . పౌల్ట్రీలు నిర్వహించే వార్కి విశేష లాభములు కలుగును .

స్త్రీలకు :- ఈ సంవత్సరం మహోన్నతంగా ఉజ్వలంగా ఉంటుంది. అన్ని విధములుగా మీదే పై చేయి ఉంటుంది. కుటుంబంలో మీ పెత్తనం సాగును. ప్రతీ చిన్న విషయానికి మీతో సంప్రదింపులు చేయుదురు.మీ పేరుతో విలువైన ఆస్తులు, వస్తువులు, వాహనాలు సమకూరును. బంగారం, వెండి వస్తువులు లభ్యం. గృహంబులో శుభకార్యములు మీ చేతులపై జరుగును. ఉద్యోగం చేయు స్త్రీలకు ప్రమోషన్స్ తో కూడిన బదిలీలు. అధికారుల మన్ననలు పొందగలరు. మీరు కోరుకున్న ప్రదేశాలకు బదిలీలు జరుగును. వివాహం కానివార్కిక సంవత్సరం వివాహం జరుగును. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన. గతంలో విడిగా ఉన్న వారు తిరిగి కలుస్తారు. గర్భిణీ స్త్రీలకు సులువుగా డెలివరీ అగును. గురుబలంచే పుత్ర సంతాన ప్రాప్తి. ఆనందము.

మొత్తం మీద ఈ రాశి స్త్రీపురుషాదులకు యోగవంతమైన సంవత్సరం. అన్ని విధములుగా బాగుంటుంది. మీ తెలివితేటలకు తోడుగా గ్రహబలం బాగుండుటచే ధైర్యంగా ముందుకు పోగలరు. ఎటువంటి కార్యాన్నైనా అవలీలగా సాధించగలరు. మీపై ప్రత్యేక దృష్టి ఉంటుంది. సాంఘికంగా, సామాజికంగా ఔన్నత్యం పొందగలరు. ఇతరుల దృష్టిమీపై ఎక్కువగా ఉంటుంది.

 చేయవలసిన శాంతులు:- అహంకారం తగ్గించుకోండి. మీపై నరఘోష అధికంగా ఉంటుంది. మంగళవారం రోజున మీ లలితా పీఠంలో రుద్రాభిషేకం చేయండి, మాస శివరాత్రి వ్రతం చేయండి. శ్రీశైల క్షేత్రం దర్శించండి, జాగరణచేయండి. అన్నదానం, వస్త్రదానం చేయండి. నరఘోష, నవగ్రహ శాంతి యంత్రాలుధరించినమంచిది.


సింహం


సింహా రాశి

ఆదాయం-8 వ్యయం-1 రాజపూజ్యం - 1 అవమానం - 5

ఈ రాశి స్త్రీ పురుషాదులకు గురుడు అష్టమమందు, భాగ్యంలో రాహువు, ఆరింట శని ఉన్నందువలన శుభా శుభ మిశ్రమ ఫలములుగా ఉండును. మీలో ఎన్ని రకములుగా శక్తి సామర్ధ్యములున్నా ముందుకు వెళ్ళలేకుండుట జరుగును. అకారణముగా మాటలు పడుట, ఏర్పడును. విపరీతమైన కష్టనష్టములకు గురి అగుదురు, శక్తిసామర్థుము, ఇతరత్రా సహాయ చేకూరుచున్ననూ, బలీయమైన దైవిక ఆటంకములచే ప్రతీ పనియందు నిరుత్సాహము. అనవసర ధనవ్యయము, శత్రుమూలక అనర్ధములకు లోనగుట, వ్యవహార చిక్కులు, మాటలుపడుట. మనస్సు పరిపరి విధములుగా వేధించుచుండును. జీవనము ప్రవాహమునకు కలతలు, అశాంతి, గుప్తశత్రుబాధలు ఏర్పడును. స్వవిషయములలో కన్నా పైవారి పనులలో ఎదురీత మాదిరిగా ఉండును. ఎక్కువ శ్రమ చేసిగాని పనులు సాధించలేరు. రక్తబంధువర్గంలో శ్రద్ధ. లేనిపోని అవమానములకు మనస్సులోనగుట. మీ సొమ్ముతిని ఉపకారం పొందినవారే శత్రువులుగా పరిణమించుట జరుగును. గృహమార్పులు. ప్రయాణములందు ఒత్తిడి. భీతి, విలువైన వస్తువులు పోగొట్టుకొనుట. సాంఘికంగా అపనిందలు. గౌరవాదులలో కలవరం. శరీరమున తెలియని వ్యాధిగా ఉండి ఔషథ సేవలు చేయుట. దొంగల వల్ల భయం.మార్పు వచ్చును. పితృ, మాతృ, కళత్రవంశ సూతకాలు తప్పక కలుగును. సోదర నష్టములు

ఉద్యోగులకు ఈ సంవత్సరమంతాఅనుకూలం. శ్రమకు తగినగుర్తింపు గవరులు తప్పనిసరిగా జరుగును. ఆదాయంకు ఇబ్బందులు. ఋణాలు చేయ వచ్చును. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వములందు పనిచేయువారు అధికారులు వల్ల ఇబ్బందులు సుదూర ప్రాంతములకు బదిలీలు జరుగుట. కుటుంబమునకు దూరంగా ఉండుట. నిరుద్యోగులకు ఈ సంవత్సరం ఆశాజనకంగా ఉండదు. జీవన స్థిరత్వము పొందలేరు. పర్మినెంటు కాని వారి సాను రంగములో ఉన్న వార్కి ఇబ్బందులు తప్పవు. కార్మికులకు అనుకూలత ఉండదు.

రాజకీయ నాయకులకు శనిబలం బాగుండుటచే అనుకూలించును. గురుబలం లేకుండుటచే అధికంగా శ్రమ పడవలసి వచ్చును . ప్రజలతో సంభంధములు అంతంతమాత్రం ఉన్ననూ అధిష్టానవర్గంలో మంచి పేరు ఉంటుంది. ఎన్నికలలో పోటీచేసిన ఆఖరినిమిషములో విజయం చేకూరును. ధనంమాత్రం విపరీతంగా ఖర్చు అవును. స్టిరాస్తులు అమ్మవలసి వచ్చును . పార్టీలోగాని , ప్రభుత్వంలో గాని ఏదో ఒకపదవి ఆఖరి నిమిషంలో వచ్చును.

కళాకారులకు ఈ సంవత్సరం మిశ్రమఫలితములుండును. విజయాలు అంతంత మాత్రమే నూతన అవకాశాలు తగ్గును. సినిమా, టి.వి.,నాటకరంగాలలో ఉన్న గాయనీ, గాయకులకు, రచయితలకు, దర్శకులకు, టెక్నీషియన్స్ అన్ని వర్గాల వార్కి సామాన్య పరిస్థితులు. ధనవ్యయం పెరిగి ఆదాయం తగ్గును. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ద్వారా లభించే అవార్డులు, రివార్డులు మీకు రావు.

ఈ సంవత్సరం వ్యాపారులకు కొన్ని వర్గముల వార్కి బాగుంటుంది. జాయింటు వ్యాపారాలు చేయువారు భాగస్వాములతో భేదాభిప్రాయాలు వచ్చి  విడిపోవుదురు . హోల్సెల్ రంగంలో ఉన్న వారికంటే రిటైల్ రంగంలో వార్కి బాగుంటుంది. వెండి, బంగారం వ్యాపారులకు నష్టం.  నువ్వులు, ప్రత్తి, ధాన్యం నిల్వచేయువారలకు లాభములు వచ్చును. రైసుమిల్లర్స్ కు బాగుంటుంది. రియల్ ఎస్టేటు రంగంలో ఉన్నవార్కి అనుకూలించును. షేర్ మార్కెట్లో ఉన్న వార్కి నష్టములు తప్పవు. ప్రభుత్వం, ప్రైవేటు కాంట్రాక్టులు, నూతన కాంట్రాక్టులు రాక ఇబ్బందులు గృహ నిర్మాణ రంగంలో ఉన్న వారి మిశ్రమ ఫలితాలు ఉంటాయి.

విద్యార్థులకు ఈ సంవత్సరం గురుబలం లేదు. జ్ఞాపకశక్తి తగ్గును. చదువుపై శ్రద్ద చూపలేరు. చెడు స్నేహములు చేయుదురు. పరీక్షలందు పోటాపోటీ మార్కులతో ఉత్తీర్ణులగుదురు. ఇంజనీరింగ్, మెడిసిన్, అసెట్, ఐసెట్, ఈ సెట్, లాసెట్, బి.ఇడి, పాలిటెక్నిక్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలు వ్రాయువారు మంచిర్యాంకులు పొందలేరు. విదేశీ చదువులందు కూడా విజయం లభించదు. క్రీడాకారులు విజయాలు లభించకపోయినా  జట్లలో స్థానం పొందగలరు.

వ్యవసాయదారులకు ఒక పంట మాత్రమే బాగుండును. ఆశించినంత దిగుబడి రాదు. ఆదాయం అంతంతమాత్రమే. ఋణాలు చేయవలసి వచ్చును. నర్సరీ,పూలు, పండ్ల తోటల వార్కి కొంత బాగుంటుంది. కౌలుదార్లకు నష్టం. డైరీ ఫారం వారికి బాగుంటుంది. చేపలు, రొయ్యలు చెరువులు చేయువారికి మిశ్రమంగా ఉండును. పౌల్ట్రీఫారం వార్కి  మంచిలాభములు వచ్చును.

స్త్రీలకు :- ఈ సంవత్సరం గురుబలం లేని కారణంగా అంతగా అనుకూలత ఉండదు. గతంలో మిమ్మల్ని పొగిడిన వారే ఇప్పుడు అవమానములకు గురిచేయుదురు. కుటుంబంలో వ్యతిరేకత ఎక్కువ. భార్యాభర్తల మధ్య అవగాహన ఉండదు. చీటికీ మాటికీ గొడవలు వచ్చును. ఒక్కసారి 2, 3 రోజులు మాటలు కూడా ఉండవు. అభిప్రాయభేదములు ఎక్కువగా వచ్చును. చాలా ఓర్పు, సహనంతో మెలగాలి. లేనియెడబాటుకు గురికావలసి వచ్చును. ఉద్యోగము చేయువారు అధికారుల మన్ననలు పొందలేరు. సుదూర ప్రాంతములకు బదిలీలు జరుగును. విలువైన వస్తువులు పోగొట్టుకుంటారు. దొంగల భయం, పితృవంశ సూతకములు తప్పవు. వివాహం కాని వార్కి ఈ సంవత్సరం వివాహం జరుగును. గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్ ద్వారా డెలివరీ జరుగును. పుత్ర సంతాన ప్రాప్తి. కొంతమందికి గర్భస్రావం జరుగును, జాగ్రత్త.

మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అష్టమ గురుడు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మీకు ఎక్కువగా శక్తి సామర్ధ్యములు ఉన్ననూ రాణించలేరు. దైవబలం కూడా సహకరించదు. జీవనం పోరాటం చేయవలసి వచ్చును. మీలో ఉన్న కోపం తగ్గించుకొని ఓర్పు, సహనంతో మెలిగిన మంచిది. ప్రతిక్షణం దైవారాధన చేయుట మంచిది.

చేయవలసిన శాంతులు :- గురు, మంగళవార నియమాలు పాటించాలి. గురు, మంగళవారాలలో లలితా పీఠంలో రుద్రాభిషేకం చేయండి. గురు, రాహువులకు జపం, హోమం, దానం చేయండి.  గురు, రాహు యంత్రాలు ధరించిన మంచిది.

 


కన్య


కన్య రాశి

ఆదాయం-11 వ్యయం -5 , రాజపూజ్యం - 4 అవమానం - 5

ఈ రాశి స్త్రీ, పురుషాదులకు గురుడు సప్తమమందు, శని 5వ ఇంట, రాహువు అష్టమమందు ఉండుట వలన జరిగిన సంవత్సరం కంటే అనుకూల పరిస్థితులు ఉండును. ధనవ్యయం బాగుండును. గృహములో శుభకార్యములు జరుగును. బంధువర్గ సమావేశములు, సంఘంలో గౌరవము, పలుకుబడి, మనోధైర్యము చేకూరును. స్థిరాస్తి అభివృద్ధి. నూతన గృహనిర్మాణములు కలిసివచ్చును. యోగ్యమైన అన్నపానీయములు లభించును. స్వవిషయంలో కళత్రమునకు స్వల్ప శరీర రుగ్మతలు కలిగినా నివారణ అగును. సంతాన, కుటుంబ వృద్ధి, పుణ్యక్షేత్ర సందర్శనము, పుణ్యకార్యములు చేయుట, కలుగును. సంవత్సర మధ్యలో స్వల్ప ఒడిదుడుకులు ఎదురైనా అంతగా బాధించవు. ప్రారంభ, అంత్యాలలో చాలా బాగా యోగించును.

ఏ రంగంలో వారికైనా అనుకూల వాతావరణం. స్త్రీ జన సహాయం. లోగడ కలిగిన లోటుపాట్లు సవరణ అగును. ప్రాణమిత్ర వైషమ్యములు అంతరించును. చిక్కు సమస్యలు పరిష్కారమగును. నూతన కార్యాలలో పాల్గొనుట, జీవనలాభం, విలువైన వస్తువులు సేకరణ, గృహ జీవితానందము, శత్రువులు మిత్రులై సహాయ సహకారములందించుట జరుగును. అష్టమ రాహువుచే ప్రతి విషయములోనూ చంచలత్వముగా ఉండును. యుక్తిచేతను, కార్యసాధన పొందగలరు. ధనవిషయంలో మీదో, ఇతరులదో చేతిలో ధనం పుష్కలంగా ఉండును. బంధుమిత్రాదుల వల్ల ఆదరణ గౌరవాదులు పొందగలరు. వ్యసనాలురీత్యా స్వల్పంగా ధన వ్యయం జరుగును. ఉద్యోగస్తులకు ఈ సంవత్సరంబాగుంటుంది. గ్రహసంచారంఅనుకూలం. ఆర్థికంగా నిల దొక్కుకుంటారు. నూతనగృహం. వాహనలాభం సిద్ధించును. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వములందు పని చేయువారలకు ప్రమోషన్స్ తో కూడిన బదిలీలు తప్పక జరుగును. పై అధికారుల మన్ననలు పొందగలరు. శ్రమకు తగిన ప్రతిఫలం లభించును. నిరుద్యోగులు ఈ సంవత్సరం జీవితంలో స్థిరత్వం పొందగలరు. పర్మినెంటు కాని వార్కి పర్మినెంటు అగును. సాఫ్ట్ వేర్ రంగంలో ఉన్నవార్కి చాలా బాగుంటుంది. కార్మికులకు అనుకూల వాతావరణం ఉంటుంది. బోనసులు లభించును.

రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉండును. గురుబలం బాగున్ననూ, శని, రాహువుల బలం లేదు, ధనము మంచి నీళ్ళవలె ఖర్చు అగును. అయినా ప్రజలలో అసంతృప్తి ఉంటుంది. అధిష్ఠానవర్గంలో మీ పేరు బాగుంటుంది ఎన్నికలలో పోటీ చేసినట్లయిన విజయం లభించుట కష్టమగును. ఆఖరి నిమిషంలో ఫలితం పొందగలరు. పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా ఏదో ఒక పదవి తప్పక లభించును. స్థిరాస్తులను అమ్ముట లేదా ఋణములు చేయుట తప్పక జరుగును. ఎంత కష్టపడినా ఫలితం దక్కదు. జాగ్రత్త అవసరం.

కళాకారులకు ఈ సంవత్సరం గురుబలం బాగుంది. మంచి విజయాలు లభించును.. టి.వి., సినిమా, నాటక రంగంలో ఉన్న గాయనీ గాయకులు, దర్శకులు, రచయితలు, ఇతర టెక్నీషియను చాలా అనుకూలంగా ఉంటుంది. జీవితంలో నిలదొక్కుకుంటారు. నూతన సంస్థల ద్వారా అవార్డులు, రివార్డులు లభించును.మీ పేరు ప్రఖ్యాతలు బాగా పెరుగును. అవకాశాలు బాగావచ్చును. గృహలాభం, వాహనలాభం కలుగును. ప్రభుత్వ మరియు ప్రైవేటు

ఈ సంవత్సరం వ్యాపారులకు చాలా బాగుంటుంది. అనుకున్న వ్యాపారం చేయగలరు. కానీ జాయింటు వ్యాపారాలు చేయువార్కి భాగస్వాములతో విభేదాలు వచ్చును. 8వ ఇంట రాహువుచే ప్రభుత్వదాడులు జరుగును. సరుకులు నిల్వచేయువారలకు విశేషంగా లాభించును. రియల్‌ ఎస్టేట్ రంగంలో ఉన్న వార్కి గత సంవత్సరం కంటే బాగుండును. షేర్ మార్కెట్లో ఉన్న వారికి ప్రారంభం, చివర బాగుండును. మధ్యలో ఒడిదుడుకులుగా ఉంటుంది. ఫైనాన్స్ రంగంలో ఉన్నవార్కి రైస్ మిల్లర్స్ కు మంచిరాళాలు వచ్చును. వెండి, బంగారం, వస్త్రవ్యాపారులకు పరిస్థితులు అనుకూలించును. ప్రభుత్వం, ప్రైవేటు కాంట్రాక్టుదారులకు సమయానికి బిల్సు వచ్చి, నూతన కాంట్రాక్టులు లభించును. డైరీ ఫామ్స్ నిర్వహించు వారికి విశేషంగా లాభములు కలిసివచ్చును.

విద్యార్థులకు ఈ సంవత్సరం గురుబలం బాగుంది. చదువుపై శ్రద్ధ ఉంటుంది. ఇతర వ్యాపకములు ఉండవు. పరీక్షలందు మంచి మార్కులతో ఉతీర్ణులగుదురు. అష్టమరాహువు, ప్రభావంచే కొంత చంచలత్వంకు గురిఅగుదురు. అయినా చదువుపై శ్రద్ధ ఉంటుంది. ఇంజనీరింగ్, మెడిసిన్, అసెట్, ఈ సెట్,లాసెట్, బి.ఇడి. ,పాలిటెక్నిక్ మొదలగు ఎంట్రన్స పరీక్షలందు మంచిర్యాంకులతో మంచికాలేజీలలో సీట్లను పొందగలరు. క్రీడాకారులకు మంచి విజయం లభించిస్థానం పొందగలరు.

వ్యవసాయదారులకు రెండు పంటలు మంచి దిగుబడివచ్చి సంతోషంగా ఉంటారు. ఋణములు తీరును. కౌలుదార్లకు బాగుంటుంది. పండ్లు, పూల తోటలు, నర్సరీ వారికి అనుకూలంగానే ఉండును. చేపలు, రొయ్యల చెరువులు వేయువార్కి గత సంవత్సరం కంటే బాగుంటుంది. పౌల్ట్రీ రంగం వార్కి మంచి ధరలు వలన విశేషంగా లాభములు కలుగును.

స్త్రీలకు :- ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. పట్టిందల్లా బంగారమా అనునట్లుండును. గురుబలం బాగుంది. మీ మాటకు తిరుగు లేకుండా పోవును. కుటుంబంలో ప్రతీ ఒక్కరూ మీమాట ప్రకారం నడుచుకుంటారు. మీ పేరుతో స్థిరాస్తులు ఏర్పడును. వ్యాపారాలు ప్రారంభిస్తారు. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. సంతాన వృద్ధి జరుగును. కుటుంబం అంతా మీ చేతుల పైనే నడుస్తుంది. బంధుమిత్రులు మిమ్మల్ని చూసి ఈర్ష్య అసూయలు పొందుదురు. ఉద్యోగాదులలో ఉన్నవార్కి అష్టమరాహువు ప్రభావంవల్ల సుదూరప్రాంతాలకు బదిలీలు, పై అధికారుల మన్ననలు పొందుదురు. ప్రమోషన్లభించును. వివాహం కాని వార్కి ఈ సంవత్సరం తప్పకవివాహం జరుగును. గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్ ద్వారా డెలివరీజరుగును. స్త్రీ సంతాన ప్రాప్తి. సంవత్సరంచివరిలో డెలివరీ అయితేపుత్రసంతానప్రాప్తి. విడిపోయిన భార్యాభర్తలు తిరిగికలుస్తారు.

మొత్తం మీద ఈ రాశి స్త్రీ, పురుషాదులు మంచి యోగమును అనుభవించుటలో సందేహం లేదు. జీవన ఔన్నత్యం. సుఖంగా, హాయిగా జీవనం గడుచును. మీ శక్తి సామర్ధ్యములు, ధైర్య సాహసములకు దైవబలం తోడుఅగుటచే అన్ని విధములుగా బాగుంటుంది. సౌఖ్యంగా ఉండును.

చేయవలసిన శాంతులు :- ఈ సంవత్సరం మీకు నరఘోష ఎక్కువగా ఉంటుంది. గాన మంగళ, శనివారాలలో లలితా పీఠంలో రుద్రాభిషేకం చేయండి, మాసశివరాత్రి వ్రతం చేయండి.. శివమాల ధరించండి. లలితా పీఠంలో  జాగరణ చేయండి. శని, నరఘోష యంత్రాలు ధరించిన మంచిది.


తుల


తుల రాశి

ఆదాయం -8 వ్యయం-8 , రాజపూజ్యం -7 అవమానం -1

చతుర్దమందు శని, ఉన్నందు వలన విశేషమయిన కొన్ని సంఘటనలు జరిగి సాంఘికముగా

ఈ రాశి వార్కి గురుడు 6వ ఇంట, రాహు, కేతువులు సప్తమ జన్మరాశులందు, రాణించగలుగుతారు. కానీ స్వశరీర, సంతాన, కుటుంబ రీత్యాను, రక్త బంధువర్గంలోనూ, శరీర రుగ్మతలు, ధనవ్యయ ప్రయాసలకు కారణమగును. చేయు కృషి వ్యవహారములలో నష్ట ద్రవ్యలాభం కలుగును. మీలో గల దుర్బలత వలన స్టెర్యాదులు లేకుండుటచేతను, ముందుకు వెళ్లలేకుండుట జరుగును. ఏ విషయంలోనూ ధైర్యం చాలదు. అనుభవమునకు కష్టఫలదాయకముగా ఉండును. గృహంబులో వివాహాది శుభకార్యములు ఘనంగా జరుగును. మీ యొక్క ఆశయములు ఫలించి అధికార వర్గరీత్యా బాగుండును. అపనిందలు వచ్చినా మిమ్మల్ని బాధించేది కాదు. ప్రాణ మిత్ర వైషమ్యములు, దగ్గర బంధువర్గములో అభిప్రాయ భేదములు వచ్చినా మిమ్మల్ని బాధించవు. మీలో నూతన భావములు స్ఫురించి, ఇతరులకు మంచి సలహాలు ఇచ్చుట జరుగును. మీ వలన మేలు పొందేవారు ఎక్కువ. ప్రయాణములలో ప్రమాదాలు వచ్చినా తృటిలో తప్పిపోవును. ధర్మకార్యములు చేయుదురు. అదే, మిమ్మల్ని కాపాడును. పిల్లల అభివృద్ధి, శుభకార్యములు కలిసి వచ్చును. శారీరక బలం తగ్గినా మానసిక గౌరవాదులకు లోటురాదు. మీ యొక్క వాక్చాతుర్యంచే ఇతరులను మీవారలుగా చేసుకుంటారు. జన్మకేతువు,సప్తమరాహువువల్ల మనఃస్థిమితం ఉండదు. మాతృ, పితృ, కళత్ర వంశ సూతక ములు తప్పక కలుగును. కుటుంబ కలహాలు అధికంగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.

ఉద్యోగులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సుదూర ప్రాంతాలకు బదిలీలు జరుగును. అసంతృప్తిగా ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొంత ఫర్వాలేదు. చేయు పనులయందు అధికారుల మన్ననలు పొందలేరు. నిరుద్యోగులకు జీవితంలో ఇంకనూ స్థిరత్వం పొందలేరు. సాఫ్ట్ వేర్ రంగంలో ఉన్నవార్కి చాలా బాగుండును. మంచి జీతముతో మరొక కంపెనీకి మారుదురు. ప్రైవేటు సంస్థల యందు పనిచేయువారు యజమానుల మెప్పును పొందలేరు. కార్మికులకు చేసిన పనికి లాభము చేకూరదు. అపనిందలు తప్పవు.

రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం అనుకూలత ఉండదు. ప్రజలలో అసంతృప్తికిశత్రుమూలకంగా ఇబ్బందులు. శనిప్రభావంవల్ల ఆర్థిక సమస్యలు ఉంటాయి. ఋణాలు చేయ గురి అగుదురు. నమ్మినవారే మోసం చేయుదురు. ఒక పార్టీ నుండి మరొక పార్టీకి మారుదురు. వలసి వచ్చును. పార్టీ ద్వారా గానీ, ప్రభుత్వం ద్వారా గానీ పదవులు రావు. ఎన్నికలయందు పోటీ చేసినట్లయిన ఓటమికి గురి అగుదురు. మానసిక ఇబ్బందులు తప్పవు. ధనవ్యయము.

కళాకారులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని విజయములు, కొన్ని అపజయములు కలుగును. సినిమా, టి.వి., నాటిక రంగములలో ఉన్న గాయనీ, గాయకులు, దర్శకులు, నటీనటవర్గం, రచయితలు, టెక్నీషియన్కు నూతన అవకాశములు స్వల్పంగా తగ్గును. ఆదాయమునకు ఫర్వాలేదనిపించును. జీవితంలో స్థిరత్వంవచ్చును. ప్రభుత్వం లేదా ప్రైవేటు సంస్థల ద్వారా అవార్డులు, రివార్డులు లభించవు.నిరాశానిస్పృహలకు గురి అగుదురు, సాధిస్తారు. నూతన వ్యాపారములు ప్రారంభిస్తారు.

వ్యాపారస్తులకు ఈ సంవత్సరం బాగుండును. అన్ని రంగముల వ్యాపారులు అనుకున్నది  సాధిస్తారు .నూతన వ్యాపారములు ప్రారంభిస్తారు . జాయింటు వ్యాపారులకు భాగస్వాములతో విభేదాలు వచ్చి విడిపోవుట. సరుకులు నిల్వచేయు వారలకు మంచి లాభాలు.  అపరదినుసులు, నూనెలు నిల్వ, ప్రత్తి నిల్వ చేయు వారలకు విశేషలాభాలు. రియల్‌ ఎస్టేట్ వ్యాపారులకు గతసంవత్సరం కంటే బాగుండును. గృహ నిర్మాణ రంగంలో ఉన్నవారికి మిశ్రమ ఫలితాలుండును. రైసుమిల్లర్స్ బాగుండును. ఫైనాన్స్ రంగంలో ఉన్న వార్కి బాగుంటుంది. షేర్ మార్కెట్లో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు.  ప్రభుత్వం ప్రైవేటు కాంట్రాక్టు రంగంలో ఉన్న వారికి కూడా బాగుంటుంది.

విద్యార్దులకు ఈ సంవత్సరం గురుబలం తగ్గింది . చదువు పై శ్రద్ద ఉండదు. ఏవో ఆలోచనలు చేస్తారు. ఇతర వ్యాపకములకు లోనగుదురు. చెడు స్నేహములు చేయుదురు. పరీక్షల యందు మంచి మార్కులు పొందలేరు. విజయం సాధించెదరు. ఇంజనీరింగ్, మెడికల్, ఆసెట్, ఈ సెట్ ఐసెట్, లాసెట్, బి.ఇడి. , పాలిటెక్నిక్ మరియు ఇతర పోటీ పరీక్షల యందు మంచి ర్యాంకులు పొందలేరు . కొన్ని సీట్లు లభించును. క్రీడాకారులకు మంచి విజయాలు లభించును.

వ్యవసాయదారులకు ఒక పంట బాగుంటుంది. మరొక పంట బాగుండదు. దిగుబడి తగి నష్టములు కలిగించును. ఋణములు తీరవు. సమస్యలు పెరుగును. కౌలుదార్లకు ఇదే పరిస్థితి ఉంటుంది. చేపలు, రొయ్యల చెరువులవార్కి అంతంత మాత్రమే. నర్సరీ, పూలు, పండ్ల తోటల వార్కి మంచి లాభములు వచ్చును. ఔషధ మొక్కల వార్కి లాభించును. పౌల్టీ రంగంలో ఉన్న వార్కి ధరలు పెరుగుటచే విశేషలాభములు కలుగును. ప్రభుత్వ సంబంధ సహాయం కల్గును.

స్త్రీలకు :- ఈ సంవత్సరం అర్ధాష్టమ శని వలన ఇబ్బందులు తప్పవు. సప్తమ శని వలన భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండదు. ఓపికతో, సహనముతో వ్యవహరించకపోతే కుటుంబం చాలా నష్టపోవును. ఉద్యోగాలలో ఉన్నవార్కి అధికారులతో ఇబ్బందులు. సుదూర ప్రాంతములకు బదిలీలు జరుగును. కుటుంబమునకు దూరంగా ఉండవలసివచ్చుట. వివాహంకాని వార్కి ఈ సంవత్సరం కూడా నిరాశే ఎదురగును. గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్ జరుగును. స్త్రీ సంతాన ప్రాప్తి, రాహు, కేతువుల వల్ల మాతృ, పితృ, భర్త వంశముల సూతకములు కల్గును. గౌరవం కోల్పోవుట జరుగును. సంతానం ద్వారా కూడా ఇబ్బందులు తప్పవు.

మొత్తం మీద ఈ రాశి స్త్రీ, పురుషాదులకు, అష్టమ శని ప్రభావం. 6 వ ఇంట గుర్తుకు కాబట్టి అనేక విషయాలలో వ్యతిరేకత ఉంటుంది . దైవబలం కూడా రక్షించుట కష్టమే అగును. మంచి ఫలితాలు ఇవ్వడు. మీరెంత సామర్థ్యం ఉన్న వ్యక్తులైనా గ్రహాల ముందు నిల్వలేదు. 'కాని ఆధ్యాత్మిక చింతనతో కొంత ఊరట కలుగును . విశేషంగా దైవరాధనచేయుట మంచిది. పాటించాలి. గురు, శనివారములలో మీ గ్రామంలో గల శివాలయంలో రుద్రాభిషేకం చేయండి.

చేయవలసిన శాంతులు:- ఈ సంవత్సరం గురు, శని, మంగళవార నియమములుశివమాల”ను ధరించండి. మాసశివరాత్రి వ్రతం చేయండి. గురు, శనికి జపాలు, హోమం చేయండి. శ్రీశైల క్షేత్రం దర్శించండి. గురు, శని, రాహు, కేతువుల యంత్రాలు ధరించాలి.


వృశ్చికం


వృశ్చిక రాశి

ఆదాయం -14 వ్యయం-14  రాజపూజ్యం-3 అవమానం-1

ఈ‌ రాశి స్త్రీ పురుషాదులకు ధనము, సంపత్తు, కుటుంబమునకు కారకుడైన గురుడు 5వ స్థానమందు, శని 3వ ఇంట బలవంతుడు. రాహు, కేతువులు 6, 12 స్థానములందు ఉండుటచే ఈ సంవత్సరం మిగిలిన రాశుల కంటే ఈ రాశికి ఉన్న బలం చాలావిశేషమైనది. గురుశనుల ప్రభావం చేతను మీరు సాధించలేని కార్యమంటూ ఏదీ ఉండదు. దీక్ష, పట్టుదలకలవారు అగుట చేతను లోగడ శతృత్వములు అంతరించును. అధికార ప్రాపకము చేకూరును. దీర్ఘ రోగములు తగ్గును. ప్రాణమిత్ర వైషమ్యములు అంతరించును. నూతనంగా స్థిరాస్తులు కొనుట... వృద్ధి చేయుట. విదేశీ ప్రయాణాలు కలసి వచ్చును. పుణ్యక్షేత్ర సందర్శనాదులు కలుగును. అన్ని విధాలుగా మంచిప్రోత్సాహం, జీవన లాభము. రాజకీయ నాయకులు వలన అభివృద్ధియు, కుటుంబ గౌరవాదులు పెరుగును. గృహంలో వివాహాది శుభకార్యాలు కలసివచ్చుట, నూతన బాంధవ్యాలు నిలిచిపోయిన కార్యాలు, వ్యవహారాలు సానుకూలం లోనికి వచ్చుట జరుగును. నూతన వాహనలాభం కలుగును. నిలిచిపోయిన బాకీలు వసూలగును. నూతన కార్యాలకు శ్రీకారంచుట్టె దరు. ఏదైనాస్థలం కొనుట, నూతన గృహనిర్మాణాది కార్యక్రమాలు బంధువృద్ధి కలుగును. ప్రతీ విషయంలోనూ ఉత్తేజకరంగా ఉండి ప్రజలకు సేవలు. ఉపయోగకరపనులు చేస్తూ పేరు ప్రఖ్యాతలు గడించెదరు. స్థిరాస్తులు వృద్ధిలోనికి వచ్చును. మీరు పట్టిందల్లా బంగారమా? అనునట్లుండును. అప్రయత్న ధనలాభాలు, స్పెక్యులేషన్ కలిసివచ్చును. నూతన తలంపుచే పైకి రాగలరు.

ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం మహోన్నతంగా ఉంటుంది. పై అధికారులు మిమ్మల్ని ప్రశంసలతో ముంచెత్తుదురు. మీ శ్రమకు తగ్గ ఫలితం. ప్రమోషన్స్ వచ్చును. ప్రత్యేక ఇంక్రిమెంట్లు లభించును. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వార్కి అనుకూలం. పెండింగ్ లో ఉన్న ప్రమోషన్స్ ఈ సంవత్సరం వచ్చును. గృహనిర్మాణాలు చేయుదురు. ప్రభుత్వ సంబంధ గౌరవాదులు లభించును. నూతన వాహనం కొంటారు. నిరుద్యోగులకు ఈ సంవత్సరంఉద్యోగం వచ్చును. పర్మినెంటు కాని వార్కి పర్మినెంటగును. ప్రైవేటు సంస్థలలో పనిచేయువారు మంచి జీతంతో మరొక సంస్థకు మారుదురు. సాఫ్ట్ వేర్ రంగంలో ఉన్న వార్కి జీతంతో పాటు బోనసులు లభించును.

రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. జీవితం ఎదురులేకుండా ఎంతటివారినైనా అణచి వేయగలరు. పార్టీలో మిమ్మల్ని ప్రత్యేకంగా గుర్తించెదరు. పార్టీలో గాని, ఉంటుంది. ప్రజలలో మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చును. శతృవులు కూడా మీకు లొంగి ప్రవర్తించెదరు. ప్రభుత్వంలో గాని ఖచ్చితంగా ఏదో ఒక పదవి లభించి తీరును ఇతర పార్టీల వారు మిమ్మల్ని ఆహ్వానించెదరు. ఎన్నికలలో పోటీచేసినట్లయితే మంచి మెజారిటీతో ఎన్నిక అగుదురు.

కళాకారులకు ఈ సంవత్సరం అనుకూలమైన సంవత్సరం. ప్రజలలో మంచి గుర్తింపు ఉంటుంది. సినిమా, టి.వి., నాటకరంగంలో ఉన్న గాయనీ గాయకులు, నటీనట వర్గం, రచయితలు, దర్శకులు, టెక్నీషియను యోగమే. విజయవంతంగా మీ ప్రదర్శనలుంటాయి. నూతన అవకాశములు అధికంగా వచ్చును. క్రొత్త కళాకారులు స్థిరత్వం పొందగలరు. నూతన వాహనం కొంటారు. ప్రభుత్వం, ప్రైవేటు సంస్థల అవార్డులు, రివార్డులు తప్పక వచ్చును.

వ్యాపారస్తులకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. అనుకున్న వ్యాపారం చెయ్యగలరు. నూతన వ్యాపారములు ప్రారంభించెదరు. అన్నిరకాల వ్యాపారులకు బాగుంటుంది. కిరాణా, హోల్ సేల్, రిటైల్ రంగంలో వార్కి అనుకూలమే. జాయింటు వ్యాపారస్తులు హుషారుగా ఇంకా ముందుకు పోగలరు. సరుకులు నిల్వ చేయువారలకు ధరలు బాగా పెరిగి లాభాలు వచ్చును. అపరదినుసులు, సుగంధ ద్రవ్యములు వార్కి విశేషలాభములు. ఫైనాన్సు రంగంలో ఉన్నవారికి అనుకూలమే రియల్ ఎస్టేటు, మరియు భవననిర్మాణ రంగంలో ఉన్నవార్కి మంచి వ్యాపారం జరుగును. షేర్ మార్కెట్లో ఉన్న వార్కి విశేషంగా యోగించును. డైరీ వార్కి అనుకూలమే. ప్రభుత్వ, ప్రైవేటు కాంట్రాక్టులు చేయువార్కి సరైన సమయానికి బిల్లు వచ్చి నూతన కాంట్రాక్టులు వచ్చును. రైసుమిల్లర్లకు విశేషంగా యోగించును. వెండి, బంగారం వ్యాపారులకు బాగుంటుంది.

విద్యార్థులకు ఈ సంవత్సరం గురుబలం బాగుంది. చదువుపై శ్రద్ధ చూపుదురు. ఇతర వ్యాపకములు ఉండవు. చెప్పుకోదగిన మార్కులతో పరీక్షలయందు ఉత్తీర్ణులగుదురు. మంచి విద్యార్థులుగా గుర్తింపువచ్చును. ఇంజనీరింగ్, మెడికల్, ఆసెట్, లాసెట్, ఈ సెట్,ఎంసెట్, బి.ఇడి., పాలిటెక్నిక్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలయందు మంచి ర్యాంకులు పొంది కోరుకున్న కాలేజీల యందుసీట్లు లభించును. విదేశీ చదువులు కూడా లభించును. క్రీడాకారులకు బాగుంటుంది.

వ్యవసాయదారులకు రెండు పంటలు మంచి దిగుబడివచ్చిలాభాలుచేకూరును. కౌలుదార్లకు బాగుంటుంది. ఋణాలు తీరును. నూతన కార్యాలు చేపడతారు. పండ్లతోటలు, పూలు, నర్సరీ వారలకు విశేషంగా లాభించును. ఔషధ మొక్కలువేయువారు ఇంకాలాభించును. చేపలు, రొయ్యల చెరువుల వార్కి గత సంవత్సరంకంటే బాగుంటుంది. పౌల్టీ ఫారమ్స్ వార్కి విశేషంగా లాభించును.

స్త్రీలకు :- ఈ సంవత్సరం అన్నివిధములుగా చాలా బాగుంటుంది. మీ మాటకు తిరుగుండదు. ఎంతటివారైనా మీమాట ప్రకారం నడుచుకుంటారు. కుటుంబంలోమీ మాటశిరోధార్యమగును. మీ పేరుతో స్థిరాస్తులు ఏర్పడును.గతంలో విడిగా ఉన్నవారు తిరిగి కలుస్తారు. బంధుమిత్రాదులలో మీకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఉద్యోగాలలో ఉన్న వార్కి తప్పక ప్రమోషvంచును. పై అధికారులు మన్ననలు, మంచి పలుకుబడి ఉంటుంది. వివాహం కాని వార్కి ఈ సంవత్సరం తప్పకుండా వివాహం జరిగి తీరును. మంచి అనుకూలమైన బాంధవ్యం ఏర్పడును. గర్భిణీ స్త్రీలకు పుత్ర సంతాన ప్రాప్తి. మీ పేరుతో ధనము నిల్వ చేయుదురు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగును. తోటివార్కి సహాయ సహకారాలు అందిస్తారు. జీవితంహాయిగా సౌఖ్యంగా ఉంటుంది.

మొత్తంమీద ఈ రాశి పురుషాదులకు మహోన్నత కాలంగా చెప్పవచ్చును. గత 5 సం||లుగా చేయలేని కార్యాలు వల్ల మీ సామర్ధ్యం వెలుగులోనికి వచ్చును. నూతనతలంపుగా పైకి రాగలుగుతారు. నూతన వ్యవహారాదులు వల్ల సాంఘికముగాను,  అధికార వర్గంగా మంచి పేరు తెచ్చుకుంటారు.

చేయవలసిన శాంతులు:- మీపై ఇతరులు దృష్టి, ద్వేషం, అసూయ వంటివి ఎక్కువగా ఉంటాయి. గాన మంగళవార నియమాలు పాటించాలి. లలితా పీఠంలో అన్నదానం చేయవలెను. నరఘోష, నవగ్రహ శాంతి యంత్రాలు ధరించిన మంచిది.


ధనస్సు


ధనస్సు రాశి

ఆదాయం-2 వ్యయం-8 రాజపూజ్యం-6 అవమానం-1

ఈ రాశి స్త్రీ, పురుషాదులకు లగ్న,చతుర్ధాధిపతియైన గురుడు చతుర్దమందు, ధన, తృతీయాధిపతి శని ధనస్థానములో, రాహు కేతువులు 5, 11లలో ఉన్నందువలన గత సంవత్సరంలో కన్ననూ పరిస్థితులు చక్కబడి ఏపని చేసినా విజయవంతంగానుండును. ఆదాయ, గౌరవాదులకు కోటురాదు. గీతసంవత్సరంలో సాధించలేని కార్యాలు లాభించును. రాజకీయ వ్యవహారములందు, విదేశములలో కూడా చాతుర్యముతో తగిన ధనాదాయం, పేరు ప్రఖ్యాతలు నిలచుట జరుగును. నూతనమైన ప్లానులువేయుట. అట్టివిఅమలుచేయుట. ఘనమైన పనులు సాధించుట. ఔదార్యం, గృహంలో వివాహాది శుభకార్యాలు కలసివచ్చుట. నూతన బాంధవ్యములు. నూతన వ్యాపారతలంపులు. కాంట్రాక్టు వంటి పనులలో లాభము. స్పెక్యులేషన్ కలిసివచ్చుట జరుగును. కానీ స్వశరీర ఆరోగ్యము పట్ల బాధపడుచుండుట జరుగును. స్థిరాస్తిలో మార్పులు వలన లాభించును. అకారణముగా కోర్టు వ్యవహారములందు దిగుట, మీయొక్క ఆశయములు ఫలించును. గృహంలో శుభకార్యాలు కలిసివచ్చును. ప్రతీ చిన్న, పెద్ద పనులతో స్త్రీ, పురుషాదులకు లోలోపల భీతి, కలవరము, ఆందోళన చెందుట, ముందుకు సాహసించలేకపోవుట కలుగును. స్థిరాస్తులను సంపాదించెదరు. అధికారులవల్ల లాభం. కుటుంబంలో ఎడబాట్లు. శరీర ఆరోగ్యం పట్ల శ్రద్ధచూపవలెను. మానసిక ఆందోళన. ఔషధ సేవలు కలుగును. మౌనముతో ప్రవర్తించాలి.

ఉద్యోగులకు ఈ సంవత్సరం ఏల్నాటి శని ప్రభావం కొద్దిగా తగ్గును. గత సంవత్సరం కంటే పరిస్థితులు అనుకూలించును. గతంలో సస్పెండు అయిన వారు తిరిగి ఉద్యోగాదులలో జాయి గుదురు. ఆదాయమునకు లోటుండదు. గృహనిర్మాణాలు కలిసివచ్చును. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలందు పనిచేయువారలకు పరిస్థితులు అనుకూలించును. ప్రమోషన్స్ ఈ సంవత్సరం రావు. అధికారుల వలన మన్ననలు, బదిలీలు కోరుకొన్న ప్రదేశాలకు జరుగును. పర్మనెంటు కాని ఉద్యోగులకు నిరుద్యోగులకు ఈ సంవత్సరంకూడా నిరాశే. సాఫ్ట్ వేరు రంగంలో ఉన్నవార్కి లాభదాయకంగా ఉండును. ప్రైవేటు సంస్థలలో ఉన్నవార్కి అనుకూల వాతావరణం ఉంటుంది. మరొక సంస్థలకు మంచి జీతంతో మారుదురు. కార్మికులకు కూడా అనుకూలంగా ఉండును.

రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రజలలో గుర్తింపు బాగుండిననూ అధిష్టాన వర్గంలో మీ పేరు అంతగా బాగుండదు. ఎన్నికలలో పోటీ చేసినట్లయిన చివరి నిమిషంలో అయినా విజయం లభించును. మానసికంగా కృంగిపోయి టెన్షన్ కలిగించును. పార్టీ పదవైనా, ప్రభుత్వ పదవైనాలభించును. ధనము మాత్రం విపరీతంగా ఖర్చగును.

కళాకారులకు ఈ సంవత్సరం బాగుంటుంది. టి.వి., సినిమా, నాటకరంగంలో ఉన్న నటీ నటులు, దర్శకులు, రచయితలు, గాయనీగాయకులకు, ఇతర టెక్నిషియన్స్ మంచి విజయములు లభించి, నూతన అవకాశములు వచ్చును. జీవితంలో స్థిరత్వం, ఒడిదుడుకులు లేకుండా ఉండును. ప్రభుత్వం మరియు ప్రైవేటు సంస్థల నుండి అవార్డులు, రివార్డులు తప్పక లభించును.

ఈ సంవత్సరం వ్యాపారస్తులకు బాగుండును. అన్నిరకాల వ్యాపారులకు రాణింపు ఉంటుంది. హోల్ సేల్, రిటైల్ వ్యాపారులు రాణించెదరు. నూతన వ్యాపారములు ప్రారంభిస్తారు. వెండి, బంగారం వ్యాపారులకు మిశ్రమంగా ఉండును. సరుకులు నిల్వ చేయువారలకు మంచి లాభములు వచ్చును. అపరదినుసులు, సుగంధ ద్రవ్యాల వార్కి లాభించును. ఫైనాన్సు రంగంలో ఉన్నవార్కి అనుకూలమే. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న గత సంవత్సరం కంటే బాగుండును. భవన నిర్మాణం చేయువార్కి అనుకూలమే. ఇనుము, సిమెంటు వ్యాపారులకు బాగుంటుంది. రైసుమిల్లర్స్ కు ప్రభుత్వ నిర్ణయాలు అనుకూలించును. డైరీలు నడుపువారికి మంచి లాభములు వచ్చును. షేర్ మార్కెట్ లో ఉన్న వార్కి ఒడిదుడుకులుగా నుండును. ప్రభుత్వ, ప్రైవేటు కాంట్రాక్టులు చేయువార్కి బిల్సు సరైన సమయానికి రాక ఇబ్బందులు. జాయింటు వ్యాపారులకు అనుకూలం.

విద్యార్ధులకు ఈ సంవత్సరం అనుకూలంగానుండును. జ్ఞాపకశక్తి పెరుగును. మంచి మార్కులతో పరీక్షలందు ఉత్తీర్ణులగుదురు. ఇతర వ్యాపకములుండక చదువుపై శ్రద్ధ ఉంటుంది. ఇంజనీరింగ్, మెడికల్, లాసెట్, ఐసెట్, అసెట్, ఈసెట్, బి.ఇడి., పాలిటెక్నిక్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలు వ్రాయువారికి మంచి ర్యాంకులు వచ్చి కోరుకున్న కాలేజీలలో సీట్లను పొందగలరు. విదేశములందు చదివేవారికి కలిసివచ్చును. క్రీడాకారులకు బాగుండును. విజయాలు లభించి, జాతీయ, అంతర్జాతీయ జట్లలో స్థానం లభించును. గౌరవ, మర్యాదలు పెరుగును.

వ్యవసాయదారులకు ఒక పంట లాభించును. రెండవ పంట దిగుబడిరాక నష్టపరచును. కౌలుదార్లకు నష్టాలు. ఋణాలు తీర్చలేరు. గృహంలో అశాంతిగా ఉంటుంది. పండ్లతోటలు, పూలు, నర్సరీల వార్కి బాగుంటుంది. ఔషధ మొక్కలు వేయువార్కి లాభించును. చేపలు, రొయ్యల చెరువుల వార్కి గత సంవత్సరం కంటే బాగుండును. పౌల్టీ రంగంలో ఉన్న వారికి లాభించును. మొత్తం మీద అన్నిరంగాల వారికి ఫర్వాలేదనిపించును. ప్రభుత్వ సంబంధ సహాయం లభించును.

స్త్రీలకు : ఈ సంవత్సరం మిశ్రమ ఫలితంగా ఉంటుంది. కుటుంబములో మీపై గౌరవ భావములు బాగుండును. మీ మాటకు విలువ పెరుగును. ఇతరులు కూడా మీ యొక్క సలహాలు తీసుకుంటారు. బంధుమిత్రులలో మీదే పైచేయిగా నుండును. భార్యాభర్తల మధ్య సరైన అవగాహనతో ముందుకు పోగలరు. విలువైన వస్తువులు సమకూరును. వాహనం కొంటారు. ఉద్యోగములలో ఉన్నవార్కి సుదూర ప్రాంతాలకు బదిలీలు. కుటుంబమునకు దూరంగా ఉంటారు. అధికారుల మన్ననలు. కొన్ని వర్గాలవార్కి ఇబ్బందులు కలుగును. అనుకోని సంఘటనలు ఎదురగును. వివాహం కాని వారికి ఈ సంవత్సరం తప్పక వివాహం జరుగును. గర్భిణీ స్త్రీలకు ఫ్రీడెలివరీ,పుత్ర సంతాన ప్రాప్తి, జీవనంసాఫీగా జరిగినా ఏదో ఒక వెలితి ఉంటుంది.

మొత్తం మీద ఈ రాశి స్త్రీ, పురుషాదులకు ఏల్నాటి శని ప్రభావం అంతగా బాధించదు. మీ ధైర్య సాహసాలువల్ల భగవంతుని అనుగ్రహం వల్ల జీవితం సౌఖ్యంగా ఉండును. ఎంతటర్పు, సహనంగా ఉంటారో అంత లాభించును. మీ యొక్క సత్రవర్తన వల్ల బలం చేకూరును.

చేయవలసిన శాంతులు :- అర్ధాష్టమ గురుడు, ద్వితీయ శని వలన గురు, శనివారం నియమాలు పాటించాలి. గురు, శనివారాలలో లలితా పీఠంలో రుద్రాభిషేకం చేయండి. గురు, శనులకు జపాలు, హోమం చేయాలి. గురు, శనియంత్రాలు ధరించిన మంచిది.


మకరం


మకర రాశి

ఆదాయం -5 వ్యయం-2  రాజపూజ్యం-2 అవమానం-4

ఈ రాశి స్త్రీ,పురుషాదులకు ధనం, సంపద, కుటుంబమునకు కారకుడైన గురుడు తృతీయ మందు, లగ్నధనాధిపతైన శని జన్మంలో రాహు, కేతువులు 4, 10లలో ఉండుట వలన ప్రతీ విషయంలోనూ ఆటంకములు హెచ్చును. అనారోగ్యం, ఔషథసేవలు. మనఃస్థిమితం లేకుండుట. చంచలత్వము. నీచ శత్రుకలహములకు కారణమగును. ముఖ్యముగా ఎలాంటి సమస్యలయినా ధనవ్యయం మీదకాని నెరవేరుటకష్టం. ఆదాయమునకు మించిన ఖర్చులు. రావలసిన బాకీలకు ఆటంకము. గృహంలోనూ, పైనా ఒకరికొకరికి మాటామాటా పట్టింపులు, అకారణంగా మాటలు పడుట కలుగును. జీవితం ఒక పరీక్షా కాలముగా నుండును. ప్రారంభం నుండి 6 మాసములు తర్వాత మిగిలిన 6 మాసాలందు ఒడిదుడుకులు అంతరించును. ఏ క్షణమున ఏమి జరుగునో భయంభయంగా ఉండును. గృహంలో వివాహాది శుభకార్యాలకు ఆటంకాలు వచ్చినా, క్రియకు కలిగి వచ్చి పెద్దల కృతంగా ఘనంగా జరుగును. కొంతమందికి చోరభయం, ఆందోళన కలిగించు సంఘటనలు జరుగును. తృతీయమందు గురుడు కూడా శుభ ఫలితములనీయడు. గాన ఈ సంవత్సరం ప్రతీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలెను. మీ ధైర్య సాహసములు, మనోబలం ఏమీ పనిచెయ్యవు. దైవారాధనవల్ల కొంత మేలుజరుగును. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా మిమ్మల్ని అవమానాలకు గురిచేయుదురు. కోర్టు వ్యవహారాలందు చిక్కుకుంటారు. గతంలో ఇతరులకు జామీనులుండుట వలన ఈ సంవత్సరం మీపైకి వచ్చుటచే ఆందోళనలకు గురి అగుదురు.

ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం ఏల్నాటి శని ప్రభావం అధికంగా ఉండును. జీవనం ప్రశ్నార్ధకంగా మారుతుంది. సస్పెండ్ కు గురికావలసి వచ్చును. కోర్టు కేసులందు ఇరుక్కొంటారు. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సుదూర ప్రాంతాలకు బదిలీలు. ప్రమోషన్స్ నిలిచిపోవును. నిరుద్యోగులకు ఈ సంవత్సరం నిరాశే ఎదురగును. పర్మనెంటు కాని వార్కి ఈ సంవత్సరం కూడా పర్మినెంటు కాదు. సాఫ్ట్ వేర్ రంగంలో ఉన్న వార్కి ఉద్యోగంలో మార్పులు మరొక కంపెనీకి మారుట, ఉద్యోగము లేకుండుట జరుగును.

రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉండదు. ప్రతీ విషయంలోనూ కాల యాపన జరుగును. మీపై ప్రతిపక్షం వారి నిందారోపణలు ఎక్కువగును. నమ్మినవారే దగా చేయుదురు. ప్రజలలో విశ్వాసం కోల్పోవుదురు. అధిష్ఠానవర్గంలోనూ వ్యతిరేకంగానుండును. పార్టీ మారవలసిన పరిస్తితి ఉంటుంది.ఎన్నికలలో పోటీ చేసినట్లయిన ఓటమి పాలగుట తప్పదు. మీకు రావలసిన పదువులు వేరే వార్కి వెళ్లిపోవును. ధనం మంచినీళ్ళవలె ఖర్చగును.

కళాకారులకు ఈ సంవత్సరం గురుబలం లేదు. దానికి తోడు ఏల్నాటి శని ప్రభావం ఎక్కువగా ఉండును. విజయములు లభించవు. టి.వి., సినిమా, నాటక రంగంలో ఉన్న నటీ నటవర్గం, దర్శకులు, గాయనీ గాయకులు, రచయితలు, ఇతర టెక్నిషియన్స్ ఆదాయం ఉండదు. నూతన అవకాశములు అంతంతమాత్రమే. కొత్తగా ప్రవేశించిన వార్కి మరింత ఇబ్బంది ఉంటుంది. అవార్డులు, రివార్డులు లభించుటకష్టమే అగును. మనోధైర్యం కోల్పోవుదురు.

వ్యాపారస్తులకు ఈ సంవత్సరం అనుకూలత ఉండదు. వ్యాపారాలు తగ్గును. అన్నిరంగాల ఇనుము, నూనె, నెయ్యి, పాల ఉత్పత్తిదారులు, డైరీ, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలించును. వార్కి ఇంచుమించు ఇదే పరిస్థితి ఉంటుంది. హోల్సేన్ & రిటైల్ వ్యాపారులకు నష్టములే. ఫైనాన్సు రంగంలో ఉన్నవార్కి మిశ్రమఫలితాలు ఉంటాయి. ఫ్యాక్టరీలు నడుపువారి ప్రోత్సాహంగా అంతంతమాత్రమే. నువ్వులు, శనగలు, ప్రత్తి, అపరదినుసులు నిల్వ చేసిన వార్కి లాభాలు వచ్చును. రైసుమిల్లర్స్ కు అనుకూలమే. చిన్న చిన్న వ్యాపారులకు, హోటల్స్ నడుపువార్కి బాగుంటుంది. ప్రభుత్వం, ప్రైవేటు కాంట్రాక్టు పనులు చేయు వార్కి బిల్సు సరైన సమయానికి రాక

విద్యార్ధులకు గురుబలం లేదు. ఏల్నాటి శని ప్రభావము ఎక్కువ. చదువుపై చూపును. జ్ఞాపకశక్తి తగ్గును. చదువుపై శ్రద్ధ ఉండదు. ఇతరవ్యాపకములపై మనస్సులగ్నం చేయుదురు. చెడు స్నేహాలు వలన నష్టపోవుదురు. వృధాగా కాలక్షేపం చేయుదురు. మెడికల్, ఇంజనీరింగ్ ఆసెట్, ఐసెట్, ఐసెట్, లాసెట్, బి.ఇడి., పాలిటెక్నిక్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలు వ్రాయువారు మంచి ర్యాంకులు పొంద చివరి నిమిషంలో ఏదో ఒక సీటు లభించి తృప్తిని పొందుదురు. క్రీడాకారులకు ఆశాజనకంగా ఉండదు. విజయములు లభించక జట్లలో స్థానం కోల్పోవుదురు.

వ్యవసాయదారులకు రెండు పంటలు నష్టమును కల్గించును. పంట బాగా పండిననూ ఏదో ఒక విధంగా నష్టపరచును. ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కౌలుదార్లకు ఇదే పరిస్థితి ఉంటుంది. పండ్ల తోటలు, పూలు, నర్సరీ, ఔషధ మొక్కలు వార్కి కొంతమేర లాభించును. చేపలు, రొయ్యలు చెరువులు చేయువార్కి,పౌల్టీ రంగంలో ఉన్న వార్కి బాగుండును.

స్త్రీలకు : ఈ సంవత్సరం అనుకూలంగా ఉండదు. కుటుంబముపై పట్టును కోల్పోవుదురు. అవమానాలు, అపనిందలు ఎదుర్కొనవలసి వచ్చును. ఆరోగ్య విషయంలో కూడా ఇబ్బందులు ఉంటాయి. ఆపరేషన్ జరిగే పరిస్థితి ఉంటుంది. విలువైన వస్తువులు పోగొట్టుకుంటారు. దొంగలవల్ల భయం. ఇంటాబయటా సమస్యలు ఎదుర్కొంటారు. ఉద్యోగములలో ఉన్న వార్కి ఆకస్మికంగా సుదూర ప్రాంతములకు బదిలీలు జరుగును. కుటుంబమునకు దూరంగా ఉండవలసి వచ్చును. పై అధికారులు వల్ల ఇబ్బందులు. శ్రమకు తగ్గ ఫలితం లభించదు. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండదు. విడిపోయే పరిస్థితులు వరకు వచ్చును. 2 లేదా 3 రోజులు మాటలుండవు.

మొత్తం మీద ఈ రాశి వివాహం కాని వార్కి ఈ సంవత్సరం వివాహం కాదు. గర్భిణీ స్త్రీలకు డెలివరీ. స్త్రీ సంతాన ప్రాప్తి పురుషాదులకు జీవితం పరీక్షాకాలమా?" అనునట్లుండును. గ్రహబలం అనుకూలించదు. మీరు ఎంత ఓర్పు, సహనముతో ఉన్ననూ అపనిందలు తప్పవు. దైవబలం ఒక్కటే కొంతవరకు మేలు జరుగును. నిత్యము భగవన్నామస్మరణ మంచిది.

చేయవలసిన శాంతులు: ఈ సంవత్సరం ఏల్నాటి శని, గురు, రాహు గ్రహాల ప్రభావం వల్ల, మంగళ, గురు, శనివార నియమాలు పాటించాలి. లలితా పీఠంలో రుద్రాభిషేకం మంచిది. ఓం నమఃశివాయ మంత్రం ఎల్లప్పుడూ జపించండి.. శని, రాహు యంత్రాలు ధరించిన మంచిది.

 


కుంభం


కుంభ రాశి

ఆదాయం -5 వ్యయం -2  రాజపూజ్యం - 5 అవమానం -4

ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధనలాభాధిపతి, ధనము, కుటుంబమునకు కారకుడైన గురుడు ఉన్నందున గ్రహముల సంచారము అనుకూలముగా ఉంది. ఏలినాటి శని ప్రభావము ఉన్ననూ ధనస్థానములో స్వక్షేత్రములో బలీయుడు. జన్మంలో శని 3, 9 స్థానములలో రాహు, కేతువులు అంతగా ఇబ్బంది పెట్టదు. గత సంవత్సరం కంటే చాలా బాగుండును. ధర్మకార్యాలు చేయుట, పుణ్యక్షేత్ర సందర్శనము. చేయు వృత్తి, వ్యాపార, వ్యవహారములందు ప్రాముఖ్యత. రాని బాకీలు వసూలగుట. అప్రయత్న ధనలాభములు. ఇతరుల వల్లబహుమానాలు పొందుట. ఆటపాటలతో విజయం చేకూరును. సంఘంలో పలుకుబడి పెరుగును. ఎటువంటి నూతనకార్యం తలపెట్టినా విజయవంతమగును. తగాదాలు, వ్యవహారాలలో మీదే పైచేయి. వెండి, బంగారము మొదలగు విలువైన వస్తువులు లభించును. భూ,గృహాది స్థిరాస్తులు సంపాదించుట, కుటుంబభారము హెచ్చుగానుండును. అప్పుడప్పుడు శని ప్రభావముచే మానసిక వేదన ఉంటుంది. వీర్యబలం తగ్గి నరముల నిస్త్రాణముచే ఆడవారియందు విరక్తి, నిస్త్రాణ కలిగించును. తగిన ఔషధ సేవ చేయుట మంచిది. గుప్తశత్రువులచే చోరభయము. రావలసిన సొమ్ముకు ఆటంకము కలిగించినా తుదకు భర్తీఅగును. రాహు,కేతువులు బలంచే అన్నివిధాలుగా బాగుంటుంది. కానీ గృహమార్పులు చేయవలసి వచ్చును. మీ తెలివితేటలు, విద్యాదక్షత, సూక్ష్మగ్రాహితనం, సున్నితమైన మనస్సు అగుటచే అవి రాణించని కారణంగా లోలోపల ఎంతగానో బాధపడుదురు. అధైర్యం పెరుగును.

ఈ సంవత్సరం ఉద్యోగులకు అన్ని విధాలుగా బాగుండును. గురుబలం బాగుంది. ఏల్నాటి శనిప్రభావం కొంత ఉంటుంది. గతసంవత్సరంకంటే బాగుంటుంది. గత సంవత్సరం ఉద్యోగులలో ఇబ్బందిపడ్డ వార్కి ఈ సంవత్సరం కుదుటపడును. సమస్యలు పరిష్కారమగును. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలందు పనిచేయువారలకు అనుకూలంగానే ఉండును. ప్రమోషన్స్ రాకపోయినాజీవనం సాఫీగా నడిచిపోవును.గృహనిర్మాణాలు చేస్తారు. నూతన వాహనంకొంటారు. సాఫ్ట్ వేర్ రంగంలో ఉన్నవార్కి మంచి జీతంతో మరొక కంపెనీకి మారుదురు. ప్రైవేటు సంస్థలలో పనిచేయువారలు యజమానుల మన్ననలు, పర్మినెంటు కాని వార్కి ఈ సంవత్సరం అంత ఆశాజనకంగా ఉండదు.

రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం అనుకూలమే. ప్రజలలో గౌరవాదులు పెరిగి తత్సంబంధాలు కలిగి ఉంటారు. గురుబలం బాగుంది. అధిష్టాన వర్గంలో మంచి పలుకుబడి ఉంటుంది. పార్టీ పదవైనా, ప్రభుత్వ సంబంధ పదవైనా ఖచ్చితంగా లభించును. ఎన్నికలలో పోటీ చేసినట్లయినా వ్యయ ప్రయాసలతో చివరి నిమిషములో విజయం లభించును. టెన్షన్ కు గురి కావలసివచ్చును. శత్రువులు వలన కొంత ఇబ్బంది తప్పదు. అధిక ధనవ్యయము తప్పదు.

కళాకారులకు ఈ సంవత్సరం యోగదాయకంగా ఉంటుంది. జీవితంలో స్తిరత్వం పొందగలరు. టి.వి., సినిమా, నాటకరంగంలో ఉన్న నటీనటులకు, గాయనీ గాయకులు దర్శకులకు విజయాలు లభించును. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ద్వారా అవార్డులు, రివార్డులు లభించును.

ఈ సంవత్సరం వ్యాపారస్తులకు బాగుంటుంది. అనుకున్న వ్యాపారం చేయగలరు. జాయింటు వ్యాపారస్తులు విడిపోవుట జరుగును. హోల్‌సేల్ & రిటైల్ వ్యాపారులకు మంచి లాభములు వచ్చును. ఇనుము, బిల్డింగ్ మెటీరియల్ వ్యాపారులకు అనుకూలించును. నూనె, నెయ్యి వ్యాపారస్తులకు విపరీతలాభములు. సరుకులు నిల్వచేయువారలకు విశేషంగా లాభం వచ్చును. రియల్ ఎస్టేటురంగంలో ఉన్న వార్కి గత సంవత్సరం కంటే బాగుంటుంది. సుగంధద్రవ్యాలు, అపరదినుసులు వ్యాపారులకు మంచి లాభాలువచ్చును. రైసు మిల్లర్స్ కు లాభాలు ప్రభుత్వ నిర్ణయాలవల్ల లాభములు, ప్రభుత్వం, ప్రైవేటు కాంట్రాక్టులు చేయువారికి ఉత్సాహంగా ఉండును. బిల్సుసరైన సమయానికి వచ్చి నూతన కాంట్రాక్టులు చేపట్టుదురు. పాల ఉత్పత్తులు, డైరీ ఫామ్స్ నడుపు వారికి విశేషలాభాలు. వెండి, బంగారు ఇరు వ్యాపారులకు మంచి వ్యాపారం జరుగును.

విద్యార్ధులకు ఈ సంవత్సరం గురుబలం బాగుంది. జ్ఞాపక శక్తి పెరుగును. చదువుపై శ్రద్ధ ఉంటుంది. ఇతర వ్యాపకములు ఉండవు. మంచి మార్కులతో ఉత్తీర్ణులగుదురు. ఇంజనీరింగ్, మెడికల్, లాసెట్, ఐసెట్, ఈ సెట్, ఆసెట్, బి.ఇడి., పాలిటెక్నిక్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలందు మంచి ర్యాంకులు పొంది కోరుకున్న కాలేజీలలో సీట్లు వచ్చును.

వ్యవసాయదారులకు రెండు పంటలు లభించును. ఉత్సాహంగా ఉంటారు. కౌలుదార్లకు అనుకూలమే. గృహంలో శుభకార్యాలుచేస్తారు. వాణిజ్యపంటలువేయువారికి విశ్లేషలాభం. పండ్ల తోటలవారు స్వల్పంగా నష్టపోదురు. నర్సరీ, పూలతోటల వారికి బాగుండును. చేపలు, రొయ్యలు చెరువులు చేయువారికి బాగుండును. పౌల్టీలు నిర్వహించు వార్కి విశేషలాభాలు కలుగును.

స్త్రీలకు: ఈ సంవత్సరం అన్ని విధములుగా బాగుంటుంది. మీ మాటకు విలువ పెరుగును. బంధుమిత్రులతో మీ జీవనం భిన్నంగా ఉంటుంది. కుటుంబంలో మీ విలువ, గౌరవం పెరుగును. అందరూ మిమ్మల్ని సంప్రదించెదరు. విలువైన వస్తువులు సమకూరును. మీ పేరుతో ఇండ్ల స్థలం గాని, ఇల్లు గాని సమకూరును. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. సుఖసంతోషాలతో జీవనం సాగును. ఉద్యోగాదులలో ఉన్న వారికి ప్రమోషన్స్ తో కూడిన బదిలీలు. అధికారుల మన్ననలు పొందగలరు. ఏల్నాటి శని ప్రభావం కొద్దిగా బాధ కలిగించును. వివాహం కాని వారికి ఈ సంవత్సరం వివాహము జరుగును. గర్భిణీ స్త్రీలక ప్రీడెలివరీ అగును. పుత్ర సంతాన ప్రాప్తి. గతంలో విడిపోయిన భార్యాభర్తలు తిరిగి కలుస్తారు. మొత్తం మీద ఈ సంవత్సరం జీవనం హాయిగా, సమస్యలు లేకుండా సాఫీగా జరిగిపోవును.

మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు ఏల్నాటి శని ఉన్ననూ అంతగా బాధించదు. గురుబలం బాగుంది. ఆర్ధిక సమస్యలు లేకుండా సుఖసౌఖ్యాదులతో జీవనం గడుచును. మీ యొక్క ధైర్యసాహసములు, శక్తి సామర్ధ్యములకు తోడు గ్రహబలం, దైవబలం తోడగుట వలన హుషారుగా, హుందాగా అనుకున్నది సాధించగలరు. నిత్యమూ దైవారాధనలో ఉండుట మంచిది.

చేయవలసిన శాంతులు :- ఈ సంవత్సరం శని ప్రభావం లేకున్ననూ, మీపై ఈర్ష్యా అసూయ ఉండును. గాన మంగళ, శనివార నియమాలు పాటించి లలితా పీఠంలో  ఆ రోజు రుద్రాభిషేకం చేయండి. శ్రీశైల క్షేత్రం దర్శనం, మాసశివరాత్రి వ్రతం చేయండి. శివమాల లేదా నరఘోష, శని యంత్రాలు ధరించిన మంచిది .


మీనం


మీన రాశి

ఆదాయం -2 వ్యయం -8  రాజపూజ్యం -1 అవమానం - 7

ఈ రాశి స్త్రీపురుషాదులకు ధనము, సంపదకు కారకుడైన, లగ్న, రాజ్యాధిపతైన గురుడు  జన్మ రాశిలో , లాభం , వ్యయాధిపతి శని లాభంలో , రాహు , కేతువులు 2,8లలో ఉండుట వలన  మిశ్రమ ఫలదాయకంగా ఉంటుంది. ఏదో విధంగా ధనం చేతికందును. అయినా వ్యయప్రయాసలకు  లోనగుట, అకారణంగా మాటలు పడుట, అపనిందలు పాలగుట జరుగును. కృషి, వ్యాపారాదుల మధ్య మధ్య ఋణము చేసినా సమర్ధతతో కొంత వరకు తీర్చివేయగలరు. శారీరకముగా కొంత ఒత్తిడి, ఆటుపోటులు, ఔషధ సేవ చేయుట కలుగును. ప్రారంభములో వివాహాది శుభకార్యములు, సంతాన, కుటుంబ వృద్ధి, గృహ జీవితానందము. ప్రాణమిత్ర వైషమ్యములు కొంత వరకు అంతరించును. గృహచ్ఛిద్రములు కూడా తొలగుట కలుగును. ఆరోగ్య విషయంలో జాగ్రత్త చూచుకొనుట మంచిది. కొన్ని సమస్యలలో రాజీ పడుట మంచిది. పుత్ర, సంతాన పీడ కలుగును. ప్రతీ పనిని స్వయంగా చూసుకోండి.. తనకంటే తక్కువ వారి వలన మాటలు పడుట కలుగును. ఆర్ధిక ఇబ్బందిచే కొన్ని పనులు నిలచిపోవును. ఆదాయంనకు మించిన ఖర్చులు కనబడును. గృహ కలతలచే ఇతరులకు లోకువగా ఉండవలసి  వచ్చును. ప్రయాణ ఆటంకాలు, శత్రుభీతి, నిరుత్సాహం, జీవితం నందు విరక్తి, స్త్రీ జనమూలకంగా నిందలు, ధనవ్యయం, మనఃస్థిమితం లేకుండుట, ప్రజల వలన ఒత్తిడి , చోర భయము. ఆడవారిలో కలతలు బయలుదేరును. ఇటువంటి వైపరీత్యములు మధ్య మధ్య గురి అగుట జరుగును. శుభ, పాప మిశ్రమ ఫలములు కలిగించును. ప్రతీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉండదు. పనులందు ఆటంకము. ఇతర వ్యాపకములు అధికంగా ఉంటాయి. ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. విలువైన వస్తువులను  పోగొట్టుకుంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వములందు ఏ పనిచేయువారలకు దూరప్రాంతములకు బదిలీలు జరుగును. అవమానాలు. అపనిందలకు గురి కావచ్చును. అధికారుల వేధింపులు ఎక్కువగుట వల్ల మనస్తాపమునకు గురి అగుదురు. సాఫ్ట్ వేర్ రంగములో ఉన్న వార్కి పరిస్థితులు కొంతమేర అనుకూలించును. ప్రైవేట సంస్థలలో పనిచేయువారలకు బాగుంటుంది. పర్మినెంట్  కానివారికి ఈ సంవత్సరం కూడా నిరాశే నిరుద్యోగులకు ఈ సంవత్సరం అసంతృప్తిగానే ఉండును.

రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం పరిస్థితులు వ్యతిరేకంగా ఉండును. ప్రజలలో గుర్తింపు తగ్గును. అధిష్ఠానవర్గం వారు కూడా మీపై సదభిప్రాయం ఉండదు. నమ్మినవారే దగా చేయుదురు. అనుకోని సమస్యలు ఎదురగును. శత్రువులు వలన నష్టములు కలిగించును. మరొక పార్టీ లోనికి మారుదురు. పార్టీ పరంగా గాని ప్రభుత్వం పరంగా కానీ పదవులు లభించవు.

కళాకారులకు ఈ సంవత్సరం కొంత ఫర్వాలేదు. జన్మ గురుడు అయినప్పటికీ కొన్ని విషయాలు లభించును. టి.వి., సినిమా, నాటక రంగాలలో ఉన్న గాయనీ గాయకులు నటీనట వర్గం, దర్శకులు, టెక్నిషియన్కు బాగుంటుంది. ఎంత ఆదాయం వచ్చినా అంతే విధంగా ఖర్చు చేయుదురు. నూతన అవకాశములు బాగానే వచ్చును. నూతన గృహం లభించును. వాహనం కొంటారు. ప్రభుత్వం, ప్రైవేటు సంస్థల ద్వారా లభించే అవార్డులు, రివార్డులు మీకు రావు.

వ్యాపారస్తులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉండును. కొన్ని వ్యాపారములు బాగుంటాయి. హోల్ సేల్, రిటైల్ రంగంలో ఉన్న వారికి బాగుండును. ఆయిల్స్, ఇనుము, సిమెంటు వ్యాపారులకు రాణింపు. వెండి, బంగారం వ్యాపారులకు అంతంత మాత్రమే. కిరాణా, మందులు, హోటల్స్ వ్యాపారులకు బాగుండును. రియల్ ఎస్టేటు వారికి గత సంవత్సరం కంటే బాగుండును. షేర్ మార్కెట్లో ఉన్న వారికి నష్టములు. సరుకులు నిల్వచేయు వారికి కొంతమేర లాభించును రైసుమిల్లకు అనుకూలంగా ఉండును. డైరీ నడుపువారికి మంచి లాభాలు వచ్చును. చిరువ్యాపారస్తులకు బాగుండును. జాయింటు వ్యాపారులకు భాగస్వాములతో విభేదాలు వచ్చి విడిపోవుదురు. ప్రభుత్వ మరియు ప్రైవేటు కాంట్రాక్టు పనులు చేయు వారికి నూతన కాంట్రాక్టులు లభించినా ఆర్థికంగా ఇబ్బందులు వచ్చును. బిల్సు సరైన సమయానికి రావు.

విధ్యార్ధులకు ఈ సంవత్సరం జన్మ గురుని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. చదువుపై  మనస్సు లగ్నం చేయలేరు. జ్ఞాపకశక్తి తగ్గును. ఇతర వ్యాపకములుండును. పరీక్షలందు మంచి మార్కులు పొందలేరు. ఇంజనీరింగ్, మెడికల్, ఆసెట్, ఈసెట్, ఐసెట్, లాసెట్, బి.ఇడి., పాలిటెక్నిక్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలు వ్రాయువారు మంచి ర్యాంకులు పొందలేక మంచి కాలేజీలలో సీట్లు పొందలేరు. క్రీడాకారులకు జాతీయ, అంతర్జాతీయ జట్లలో స్థానం పొందలేరు. వ్యవసాయదారులకు ఒక పంట మాత్రం ఫలించును. రెండవ పంట ఫలించదు. నష్టము కలుగును. ఆదాయం లేక ఋణాలు చేయవలసి వచ్చును. కౌలుదార్లకు ఇబ్బందులు, ఔషధ మొక్కలు, వాణిజ్యపంటలు, పండ్ల తోటలు,పూలు, నర్సరీల వారు రాణింపు ఉంటుంది. చేపలు, రొయ్యల చెరువులు వారికి మిశ్రమ ఫలితాలు. పౌల్ట్రీ రంగములో ఉన్న వారికి ఈసం||రం బాగుండును.

స్త్రీలకు :- ఈ సంవత్సరం అంత అనుకూలంగా ఉండదు. కుటుంబ స్థానంలో రాహువు  వల్ల కుటుంబ విరోధాలు తప్పవు. మీకున్న విలువ తగ్గును. విలువైన వస్తువులను పోగొట్టుకుంటారు. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండదు. చీటికీ మాటికీ చిన్ని చిన్న తగాదాలు వచ్చును. ఓర్పు సహనంతో ఉండాలి, కానీ ఉండలేరు. ఉద్యోగములలో ఉన్న వారికి బదిలీలు తప్పవు. తగ్గ గుర్తింపు పొందలేరు. గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్ ద్వారా డెలివరీ అగును. పుత్ర సంతాన ప్రాప్తి. పై అధికారుల వలన ఇబ్బందులు, అకారణంగా విరోధములు అపనిందలు వచ్చును. శ్రమకు జీవనం సాఫీగా ఉండును. ఒడిదుడుకులుగా ఉండదు. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. పురుషాదులకు మిశ్రమ ఫలితాలు ఉండును. మీ యొక్క శక్తి సామర్ధ్యములు, తెలివి తేటలు ఏమీ పని చేయవు. గ్రహబలం బాగాలేని కారణంగా అనుకూలత ఉండదు. మనోచాంచల్యంతో పనులందు నిమగ్నులు కాలేరు. బద్దకం ఎక్కువగా ఉంటుంది. అనుకోని సమస్యలు వచ్చి మీద పడును. దైవబలం కూడా సహకరించదు. జాగ్రత్త అవసరం.

చేయవలసిన శాంతులు :- ఈ సంవత్సరం దైవారాధన ఎక్కువ చేయాలి. గురు, మంగళవార నియమాలు పాటించవలెను. ఆయా వారములలో మాస శివరాత్రి వ్రతం చేయండి. శివమాల ధరించండి . గురు రాహు కేతు యంత్రములు ధరించిన మంచిది.